Saidabad Rape : సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష

హైదరాబాద్ సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ దీక్ష చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

Saidabad Rape : సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష

Sharmila

YS Sharmila Initiation : హైదరాబాద్ లోని సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ దీక్ష చేస్తానని ఆమె స్పష్టం చేశారు. చిన్నారి కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని అడిగారు.

చిన్నారి పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరిగాయన్నారు. ఎన్ కౌంటర్ చేస్తారో.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారో మీ ఇష్టం అమ్మాయిపై చేయి వేస్తే తల తెగి పడుతుందనే భయం కల్పించాలని షర్మిల అన్నారు.

Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణ హత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు రాజు. సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి బాలిక కనిపించలేదు. ఎంత వెతికినా కుటుంబసభ్యులకు కనిపించలేదు. అయితే పాప ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు.

కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో చిన్నారి కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.

Sajjanar : రంగంలోకి సజ్జనార్.. నిందితుడు బస్టాండ్లలో ఉండొచ్చు.. ఆర్టీసీ సిబ్బంది బీఅలర్ట్..!

ఘటన జరిగిన రోజు నుంచి నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పోలీసు శాఖ 10 బృందాలను ఏర్పాటు చేసి రాజుకోసం గాలిస్తోంది. అయినా నిందితుడి ఆచూకీ లభించలేదు. పరారీలో ఉన్న నిందితుడు రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడిని పట్టిచ్చిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ప్రకటించారు.