Ponnam Prabhakar: కేసీఆర్ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం: పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నిర్ణయంతో ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారుతాయి.

Ponnam Prabhakar: కేసీఆర్ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నీళ్లను మహారాష్ట్రకు తోడుకొమ్మని సీఎం కేసీఆర్ చెప్పడం తెలంగాణకు తీరని అన్యాయం చేయడమేనని విమర్శించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. జీవనదిలాంటి ఎస్సారెస్పీని మహారాష్ట్ర చేతికి ఇస్తే, ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం శ్మశానం అవుతుందని పొన్నం అభిప్రాయపడ్డారు.

Peru landslides: పెరూలో విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృతి

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందాల్సిన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంపై మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నిర్ణయంతో ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్రకు ఇస్తే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారుతాయి. ఎస్సారెస్పీ వరద కాలువ ప్రాజెక్టు వృథా అవుతుంది. ఎస్సారెస్పీ నీళ్లు మహారాష్ట్ర తోడుకుంటే తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోసం. ఇప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తా అంటే కేసీఆర్‌ను ప్రజలు చీకొడతారు.

White Tigress: ఢిల్లీ జూలో అతిపెద్ద తెల్ల పులి మృతి.. అనారోగ్యమే కారణమా?

గోదావరిపై మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన మనం.. ఇప్పుడు నీళ్లను ఆ రాష్ట్రం తోడుకుంటే చూస్తూ ఊరుకుందామా? ఒకప్పుడు బాబ్లీ మీద పోరాటం చేసిన వాళ్లు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వాళ్లు ఈ నిర్ణయంపై ఏమంటారు? బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయ స్వార్ధం కోసం గోదావరి నీళ్లను తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోకపోతే రైతు ఉద్యమం చేయకతప్పదు’’ అని పొన్నం వ్యాఖ్యానించారు.