పంచాయతి ఎన్నికలు : మధ్య వేలికి ఇంకు గుర్తు…

  • Published By: madhu ,Published On : January 3, 2019 / 02:35 AM IST
పంచాయతి ఎన్నికలు : మధ్య వేలికి ఇంకు గుర్తు…

హైదరాబాద్ : ఓటు వేశారా ? అంటే వేశాం..అని ఇంకు రాసిన చూపుడు వేలును చూపిస్తుంటారు. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాము ఓటు వేశామని..సెలబ్రెటీలు..ఇతరులు చూపుడు వేలును చూపిస్తూ సెల్ఫీలు దిగారు కూడా. ఇప్పుడు మాత్రం చూపుడు వేలు కాకుండా మధ్య వేలిని చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిరా గుర్తు మధ్య వేలికి వేయనున్నారు. 
మోగిన నగారా..కోడ్ అమల్లోకి…
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు బిజీ బిజీ అయిపోయారు. ఇక్కడే అధికారులకు ఓ సమస్య వచ్చి పడింది. ఓటు వేసిన అనంతరం ఏ వేలికి సిరా గుర్తు పెట్టాలా ? అనే అనుమానం వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి చూపుడు వేలికి సిరా గుర్తు పెట్టడం..ఆ గుర్తు ఇంకా పోకపవడంతో అధికారులు ఏమి చేయాలా ? అని ఆలోచించారు. చెరగని సిరా గుర్తు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చే వారి ఎడమ చేతి మధ్యవేలికి సిరా చుక్కను పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శ ఎం. అశోక్ కుమార్ జనవరి 2వ తేదీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.