వరదసాయం పంపిణీలో అక్రమాలపై హైకోర్టులో విచారణ..ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి నోటీసులు

వరదసాయం పంపిణీలో అక్రమాలపై హైకోర్టులో విచారణ..ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి నోటీసులు

irregularities in the distribution of flood relief : వరదసాయం పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు అంగీకరించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అవకతవకలకు పాల్పడ్డారంటూ దాసోజు శ్రవణ్ లేఖలో పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం టీఆర్ఎస్ నేతలే డబ్బులు పంచారని ఆయన వెల్లడించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, ఎస్ఈసీకి, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. సంక్రాంతి తర్వాత దీనిపై విచారణ జరగనుంది.