INSOFE Software Company : హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ సంస్థ .. ఏడాదిన్నరగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులకు ఉద్వాసన

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏడాదిన్నరగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేసినట్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 700లమంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లుగా ప్రకటించటంతో ఉద్యోగలు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు ఉద్యోగులు.

INSOFE Software Company : హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ సంస్థ .. ఏడాదిన్నరగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులకు ఉద్వాసన

Hyderabad INSOFE Software Company

INSOFE Software Company : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్సోఫీ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఏడాదిన్నరగా జీతాలు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను తీసివేసినట్లుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో 700లమంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఈమెయిల్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లుగా ప్రకటించటంతో ఉద్యోగలు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు ఇన్సోఫీ సంస్థ ఉద్యోగులు.

ప్రస్తుతం ఇన్సోఫీ కంపెనీలో ఏడు వందల మంది ఉద్యోగులు ఉన్నారు. సుమారు 650 మంది నుంచి రూ.4 లక్షల చొప్పున అలాగే 50 మంది నుంచి రూ.10 లక్షల చొప్పున పలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుందని తెలుస్తోంది. ఏడాదిన్నరగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోయినా పనిచేశారు. కానీ సడెన్ గా మెయిల్ లో ఉద్యోగం నుంచి తొలగించేశాం అని ప్రకటింటంతో ఖంగుతిన్నారు. అందరు ఆఫీసుకు చేరుకున్నారు. కానీ అప్పటికే తాళాలు వేసి ఉండటంతో కార్యాలయం ముందే ఆందోళన చేపట్టారు.

అనంతరం తమకు అన్యాయం చేసిన సంస్త ఇన్సోఫీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిక పోలీసులు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థను రన్ చేస్తున్నారు? ఉద్యోగుల పేరుతో ఏఏ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు? వంటి పలు కీలక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.