Intense Sun : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలపై భానుడి ప్రతాపం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Intense Sun : తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలపై భానుడి ప్రతాపం

Intense sun

Intense Sun : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగ భగలకు జనాలు విలవిల్లాడిపోతున్నారు. మరో నాలుగు రోజులపాటు ప్రచండ భానుడు ప్రతాపం చూపనున్నాడు. సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని ఏడు జిల్లాలపై భానుడు ప్రతాపం చూపనున్నాడు. దీంతో ఆ ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచించింది.

Hottest Summer : మరింత పెరగనున్న ఎండల తీవ్రత.. ఏప్రిల్, మే నెలల్లో పొంచి ఉన్న ముప్పు

ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉందంటూ తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 43.33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, యాదాద్రి, అసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.