దుబ్బాక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి : బీజేపీని అడ్డుకునే వ్యూహాలపై టీఆర్ఎస్ దృష్టి

  • Published By: bheemraj ,Published On : November 10, 2020 / 09:27 PM IST
దుబ్బాక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి : బీజేపీని అడ్డుకునే వ్యూహాలపై టీఆర్ఎస్ దృష్టి

GHMC elections : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ ఎంసీపై ఎలా ఉంటుందన్నదానిపై టీఆర్ఎస్ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితంతో బీజేపీ దూకుడు ప్రదర్శించే అవకాశముండటంతో గ్రేటర్ లో ఆ పార్టీని ఎలా అడ్డుకోవాలి అనేదానిపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది.



గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో నెగ్గింది. ఆ తర్వాత మరికొందరు కార్పొరేటర్లు కారెక్కారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అదేస్థాయి ఫలితాలు పునరావృత్తం చేయాలని పట్టుదలతో ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికలకు వెళ్లనుంది. ఇప్పటికే గ్రేటర్ నేతలతో పలు మార్లు కేటీఆర్ సమావేశం అయ్యారు. దీంతో ఈ ఎన్నికలు ఆయనకు సవాల్ గా మారనున్నాయి. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిని కల్గిస్తోంది.



దుబ్బాకలో గెలుపుతో బీజేపీ గ్రేటర్ పై దృష్టి సారించింది. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. దుబ్బాక ఓటమితో కొత్త వ్యూహాలతో టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. గ్రేటర్ లో బీజేపీని అడ్డుకునే వ్యూహాలపై టీఆర్ ఎస్ దృష్టి పెట్టింది. టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని చెప్పడమే బీజేపీ టార్గెట్ అని తెలుస్తోంది. బీజేపీ జోరు పెంచకుండా బ్రేకుల వేయడమ టీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది.



గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదేస్థాయిలో విజయం సాధించాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే గ్రేటర్ నేతలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. దుబ్బాక ఫలితం ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపై లెక్కలు వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ కు సవాలుగా మారనున్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి పోటాపోటీ తప్పదంటూ అంచనాలు. గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయా లేక ఆలస్యమవుతాయా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.