ఇంటర్ పరీక్షలు మార్చి 24వ తేదీ నుంచే!

  • Published By: vamsi ,Published On : September 11, 2020 / 07:16 AM IST
ఇంటర్ పరీక్షలు మార్చి 24వ తేదీ నుంచే!

కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మొత్తం రద్దు కాగా.. వచ్చే ఏడాది మార్చి 24వ తేదీ నుంచి వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అవనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు మొత్తం 182 పనిదినాలను లెక్కించింది. కొవిడ్‌-19 కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో 228 నుంచి గరిష్ఠంగా 46 పనిదినాలు తగ్గించారు.




దసరా సెలవులు అక్టోబర్‌ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడ్రోజులు పాటు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13, 14 తేదీలుగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాలకు అనుగుణంగా క్యాలెండర్‌లో స్వల్ప మార్పులు ఉంటాయని ఇంటర్‌బోర్డు వెల్లడించింది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతే అన్ని జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టాలని, ప్రైవేటు కాలేజీల్లో పీఆర్వో వ్యవస్థను నిషేధిస్తున్నట్టు తెలిపింది. తమ కళాశాలలో చేరాలని ప్రకటనలు ఇవ్వడం, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, కరపత్రాలు, వాల్‌రైటింగ్స్‌ను నిషేధించినట్టు చెప్పింది. అర్హులైన లెక్చరర్లను స్పాట్‌ వాల్యూయేషన్‌కు పంపని వారిపైన చర్యలు ఉంటాయని బోర్డు తెలిపింది.
https://10tv.in/railways-to-hold-exams-for-1-40-lakh-posts-from-december-15/
ఇంటర్‌ బోర్డు విద్యా క్యాలెండర్‌:
మొత్తం పనిదినాలు 182
తరగతులు ప్రారంభ తేదీ సెప్టెంబర్‌ 1, 2020
కాలేజీలకు చివరి పని రోజు ఏప్రిల్‌ 16, 2021
ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి 27, 2021



ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20, 2021
ఇంటర్‌ థియరీ పరీక్షలు మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12, 2021
వేసవి సెలవులు ఏప్రిల్‌ 17 నుంచి మే 31, 2021
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మే చివరి వారం, 2021
నూతన విద్యా సంవత్సరం జూన్‌ 1, 2021