Intermediate Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు 4 లక్షల 59 వేల మంది హాజరు కానున్నారు.

Intermediate Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

Intermediate

Intermediate first year exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ పరీక్షలకు నాలుగు లక్షల 59 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలను అనుసరించి, 17 వందల 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కోవిడ్ వాక్సిన్ తీసుకున్న వారినే పరీక్షల విధుల్లో నియమించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసోలేషన్ రూంలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కరోన బారిన పడితే వారికి తరువాత పరీక్ష రాసే అవకాశం ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా 2020-21 విద్యాసంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేసింది. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్‌కు మార్కులను పెంచి మెమోలు ఇచ్చింది.

TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి సర్వం సిద్ధం..పాసులు ఉంటేనే అనుమతి

అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కు మాత్రం పరీక్షలను నిర్వహించలేదు. దీంతో తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో.. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి కొత్తగా మొబైల్ యాప్‌ను వినియోగంలోకి తీసుకు వచ్చారు. ఓఎంఆర్‌ షీట్‌లో మాల్‌ప్రాక్టీస్‌, బ్లాంక్‌ బార్‌ కోడ్‌, ఆబ్సెంట్‌, డ్యామేజ్‌, బార్‌కోడ్‌, ఎయిడెడ్‌ క్యాండిడేట్స్‌ వంటి సేవలను యాప్‌ అందించనుంది.

నిజామాబాద్‌ జిల్లాలో 18697 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో 16480 మంది జనరల్‌, 2217 మంది వొకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 71 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 16 ప్రభుత్వ కళాశాలలు, 2 ఎయిడెడ్‌, 3 సోషల్‌ వెల్ఫేర్స్‌, 8 టీఎస్‌ మోడల్‌ స్కూళ్లు, 27 ప్రైవేట్‌ కాలేజీలు, 4 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రైవేట్‌ స్కూల్‌ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 8891 మంది జనరల్‌, 1141 మంది వొకేషన్‌ కలిపి మొత్తం 10,032 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

T20 World Cup 2021: టీమిండియా దారుణ వైఫల్యం.. చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్

ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 27 ప్రభుత్వ, 15 ప్రైవేట్‌ కళాశాల సెంటర్లు ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్‌ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పాత కలెక్టరేట్‌లోని మైనారిటీ మహిళా జూనియర్‌ కళాశాలకు మార్చారు. కామారెడ్డి జిల్లాలో పరీక్షలను పర్యవేక్షించేందుకు 42 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 42 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ముగ్గురు సిట్టింగ్‌ స్కాడ్‌లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్కాడ్‌లు, 15 మంది అసిస్టెంట్‌ సూపరింటెండెంట్లు, మూడు డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు రెండు హైపర్‌ కమిటీలను ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారు. ఇందుల్లో చైర్మన్‌గా కలెక్టర్‌, సభ్యులుగా ఎస్పీ, ఇంటర్‌ నోడల్‌ అధికారి, సీనియర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. సుమారు 510 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని నిజామాబాద్‌ డీఐఈవో రఘురాజ్‌ తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి హాల్‌టికెట్లను నేరుగా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం, కళాశాల స్టాంపులు అవసరం లేదన్నారు. విద్యార్థి ఫొటో, వివరాలను పరిశీలించి పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పారు.

Banana : రోజుకో అరటిపండుతో…గుండె, కిడ్నీ సమస్యలకు చెక్

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కామారెడ్డి నోడల్‌ అధికారి షేక్‌ సలాం తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోనికి అనుమతించబోమని హెచ్చరించారు. విద్యార్ధులు పరీక్షా సమయానికి అరగంట ముందే చేరుకోవాలని సూచించారు.

ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్‌ సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, సెంటర్లకు చుట్టుపక్కల ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.