CapitaLand Investments In Telangana : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం.. రూ.6,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న క్యాపిటల్యాండ్

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద, ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. మొన్న అమ‌ర‌రాజా గ్రూప్ 9వేల 500 కోట్ల రూపాయల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

CapitaLand Investments In Telangana : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం.. రూ.6,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న క్యాపిటల్యాండ్

CapitaLand Investments In Telangana : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద, ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ చేశాయి. మొన్న అమ‌ర‌రాజా గ్రూప్ 9వేల 500 కోట్ల రూపాయల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పెట్టుబ‌డితో పాటు 4వేల 500 మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు అమ‌ర‌రాజా గ్రూప్ చెప్పింది. తాజాగా తెలంగాణ‌లో భారీ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఐటీ కారిడార్‌లో రూ.6,200 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు క్యాపిటల్యాండ్ అనౌన్స్ చేసింది.

రూ.6వేల 200 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ తో క్యాపిటాల్యాండ్.. ఓ డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది క్యాపిటల్యాండ్ సంస్థ. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ అవసరాలు క్యాపిటల్యాండ్ డేటా సెంటర్ తో తీరతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒక్కటన్న కేటీఆర్.. రాష్ట్రంలో కేపిటల్యాండ్ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రూ.6,200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు క్యాపిట‌ల్యాండ్ తెలిపింది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సీఎల్‌ఐఎన్‌టీ ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్‌ లో క్యాపిటల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటీపీహెచ్‌ డేటా సెంటర్‌ను ఐదేళ్ల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదేళ్లలో మరో రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.