IPS Rashmi Shukla : ముంబై పోలీసులు వేధిస్తున్నారు : కోర్టును ఆశ్రయించిన మహిళా ఐపీఎస్

IPS Rashmi Shukla : ముంబై పోలీసులు వేధిస్తున్నారు : కోర్టును ఆశ్రయించిన మహిళా ఐపీఎస్

Ips Rashmi Shukla High Court

IPS Rashmi Shukla High Court : ముంబై పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఐపీఎస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన ధర్మాసనం ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆమె పిటీషన్ పై మీ వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ అదనపు డీజీగా ఉన్న మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిణి ముంబై పోలీసులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఆమె నిఘా విభాగాధిపతిగా ఉన్న సమయంలో రష్మీ సుక్లా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ముంబైలో ఆమెపై కేసు నమోదైంది. దీనిపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత కరోనా సమయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముంబై పోలీసులు తనను వేధిస్తున్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో రష్మీ సుక్లా పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై స్పందించిన హైదరాబాద్ హైకోర్టు ఆమె పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ముంబై పోలీసులకు నోటీసులు జారీచేసింది. రష్మీ శుక్లా పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.

కాగా..పోలీసు పోస్టింగులకు సంబంధించిన రష్మీ సుక్లా కీలకమైన పేపర్స్ లీక్ చేసినట్లుగా ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఆమెకు సమన్లు కూడా జారీ చేశారు. రష్మీ సుక్లా ప్రస్తుతం హైదరాబాద్ లో ఎడిజి సీఆర్పీఎష్ గా నియమితులు కావటంతో ఇక్కడూ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ముంబై కోర్టుకు హాజరు కాలేనని తెలిపారు. కానీ విచారణకు హాజరు కావాల్సిందేనని ముంబై పోలీసులు తెలపటంతో ఆమె హైదరాబాద్ హైకోర్టుకు ఆశ్రయించారు.

ముంబైలో కరోనా కేసులు భారీ స్థాయిలో ఉన్నందున ఈ సమయంలో తాను అక్కడికి వెళ్లలేననీ..కానీ ముంబై పోలీసులు తనను ఈ విషయంపై వేధిస్తున్నారంటూ ఆమె ధర్మాససాన్ని ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ హైకోర్టు మంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఐపీఎస్ రష్మీ సుక్లా చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసును కోర్టు విచారించనుంది.