కరోనాతో చనిపోతే దయనీయం : అంత్యక్రియల్లో ఐదుగురు..ఆసుపత్రిలో ముగ్గురే..మార్గదర్శకాలు జారీ

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 02:20 AM IST
కరోనాతో చనిపోతే దయనీయం : అంత్యక్రియల్లో ఐదుగురు..ఆసుపత్రిలో ముగ్గురే..మార్గదర్శకాలు జారీ

కరోనా రాకాసి అష్టకష్టాలు పెడుతోంది. వైరస్ బారిన పడిన వారి పరిస్థితి మరి దయనీయంగా మారుతోంది. వీరు ఎవరినీ కలవడానికి వీలు లేదు. కొన్ని రోజుల పాటు నిర్భందంలో కొనసాగాలి. వీరు ఒకవేళ చనిపోతే..మాత్రం పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. అంత్యక్రియలకు సంబంధిందించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. హిందూ, ముస్లిం, క్రైస్తవులు సాంప్రదాయాల ప్రకారం…వీరికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

వీరి విషయంలో కొన్ని కండీషన్స్ పెట్టింది. అనుమానిత / నిర్ధారిత మృతుల అంత్యక్రియల్లో ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబసభ్యులకు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం లభించనుంది. డెడ్ బాడీని కనీసం ముట్టుకోవడానికి కూడా వీలుండదు. ముఖం కనిపించే విధంగా ప్లాస్టిక్ షీట్ లో చుడుతారు. లీక్ ప్రూఫ్ జిప్ బ్యాగులో ప్యాక్ చేస్తారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి బంధువులు, కుటుంబసభ్యులు ముందుకు వస్తే..కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతినిస్తారు. 

వీరంతా..సొంత రవాణా సదుపాయం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆసుపత్రి వైద్యుడు అందించిన మాస్క్ లు, గ్లౌజ్స్ ధరించాలి. 4 మీటర్ల దూరాన్ని పాటించాలి. ఆయా మతాలకు సంబంధించి ప్రార్థనలు చేసుకోనే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకు కూడా పలు నిబంధనలు పెట్టారు. హిందువులయితే… 3 మీటర్లున్న పొడవైన కట్టెతో డెడ్ బాడీకి నిప్పు పెట్టాల్సి ఉంటుంది.

అంత్యక్రియల్లో 4 మీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఇతర పనులన్నీ ప్రభుత్వం నియమించిన వ్యక్తులు పూర్తి చేస్తారు. కార్యక్రమాలు పూర్తికాగానే..వ్యక్తులందకరూ తమ పీపీఈలను ప్రత్యేక కవర్ లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. బాడీ హ్యాండర్లు పీపీఈ తో పాటు వాహనంపై సోడియం హైపో క్లోరైడ్ ను పిచికారీ చేయాలి. 
 

హిందువులు : 
శ్మశాన వాటికకు చేరే ముందు..దహన సంస్కారం చేయడానికి అవసరమైన కర్రలు, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు టైం స్లాట్ ను కుటుంబసభ్యులు ముందుగానే తీసుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలుసుకున్నాక.. ఆసుపత్రి సీఎల్ ఓ డెడ్ బాడీని ఆసుపత్రి నుంచి బయటకు పంపాలి.  అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన రక్షణ ఏర్పాట్లను GHMC ఏర్పాటు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. 
 

ముస్లింలకు : 
మృతుడి శరీరాన్ని ప్లాస్టిక్ షీట్ లో చుడుతారు. తెల్లటి కాటన్ వస్త్రం కప్పుతారు. ముక్కు రంధ్రాలను దూదితో మూసివేస్తారు. నోరు తెరుచుకోకుండా మూసివేస్తారు. డెడ్ బాడీని చుట్టకముందు రసాయనాలు స్ప్రే చేస్తారు. 
 

క్రైస్తవులకు : 
మృతుడి కుటుంబసభ్యులు కఫిన్ (పెట్టె) సమకూర్చాలి. అనంతరం కపిన్ ను ఆసుపత్రికి పోలీసులు, వైద్యులు తరలించాలి. కఫిన్ బాక్సు మూతను కొద్దిగా తెరిచి కేవలం ఐదు మందికి మాత్రమే కడసారి చూసేందుకు అనుమతినిస్తారు. కుటుంబసభ్యు సూచించిన ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. స్థలం లేకపోతే…అందుబాటులో ఉన్న స్థలాల్లో డెడ్ బాడీస్ కు జీహెచ్ఎంసీ అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కరోనా ప్రత్యేక అంబులెన్స్ లో తరలిస్తారు.