Madhapur IT Company Fraud : ఏం తెలివి..! ఒక్క యాడ్‌తో కోట్లు కొట్టేశాడు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం

హైదరాబాద్ మాదాపూర్ లో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ ఫేక్ ఐటీ కంపెనీ.

Madhapur IT Company Fraud : ఏం తెలివి..! ఒక్క యాడ్‌తో కోట్లు కొట్టేశాడు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం

IT Company Fraud In Madhapur, Cheating In The Name Of Software Jobs

Madhapur IT Company Fraud : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో ఘరానా మోసం.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

Madhapur IT Company Fraud : హైదరాబాద్ మాదాపూర్ లో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ ఫేక్ ఐటీ కంపెనీ. ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ ప్రతాప్ ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు న్యాయం చేయాల్సిందిగా బాధితులతో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు ఈ ఫేక్ కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. మాదాపూర్‌లో డ్యానోన్(Danyon) ఐటీ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్‌ చేసింది.

ఉద్యోగం ఫైనల్‌ చేసుకున్న వారితో కంపెనీ డీల్‌ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్‌ లెటర్స్‌ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్‌ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు.

కాగా, మూడు రోజుల క్రితం కేసు నమోదు చేసినప్పటికీ.. యజమానిని రిమాండ్ కు తరలించలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి చెప్పారు.

ఇప్పుడు కొత్త రకం మోసాలు జరుగుతున్నాయి. పెద్దగా కష్టపడకుండానే చొక్కా నలగకుండానే సింపుల్ గా చీటింగ్ చేస్తున్నారు. జస్ట్.. ఓ యాడ్ తో కోట్లు కొల్లగొట్టిన వైనం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అందుకు నిదర్శనమే.. మాదాపూర్ లో ఫేక్ ఐటీ కంపెనీ వ్యవహారం.

దన్యన్ అనే కంపెనీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు అంటూ ఫేస్ బుక్ లో యాడ్ ఇచ్చింది. ఆ యాడ్ చూసి వందమందికిపైగా నిరుద్యోగులు టెంప్ట్ అయ్యారు. టెలిఫోన్ లోనే వారందరికి ఇంటర్వ్యూలు నిర్వహించి జీతం 4లక్షల ప్యాకేజీ ఇస్తామని నమ్మించింది. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2లక్షలు డిపాజిట్ చేయించుకుంది. ట్రైనింగ్ అంటూ కొన్ని రోజులు డ్రామా ఆడింది. చివరకు బోర్డు తిప్పేసింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.