Minister KTR Fires On Opposition : సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించాలి-కేటీఆర్

సోషల్ మీడియాలో  టీఆర్ఎస్  కార్యకర్తలు విజృంభించి  బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్   టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Minister KTR Fires On Opposition : సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించాలి-కేటీఆర్

Ktr In Kamareddy Trs Meeting

Minister KTR Fires On Opposition : సోషల్ మీడియాలో  టీఆర్ఎస్  కార్యకర్తలు విజృంభించి  బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్   టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రమే వరి కొనుగోలు చేయాలంటూ ఈనెల 12న ఆందోళనలు నిర్వహించి బీజేపీ మెడలు వంచే విధంగా ధర్నా చేయాలని ఆయన సూచించారు.

కామారెడ్డిలో ఈరోజు జరిగిన   నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మంత్రి   ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ హజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన, సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని….రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Prostitution House : వ్యభిచార గృహంపై దాడి-నిర్వాహకులు అరెస్ట్

వరిధాన్యం కొనలేమని కేంద్రమే రాష్ట్రాలకు లేఖ  రాసిందని ఆయన తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా   కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని…. కాంగ్రెస్, బీజేపీ, టిడిపి, వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత  ఆయనదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని…60 ఏళ్ల  పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో  కరెంట్ కోతలు, కరెంట్ షాక్ లు, రైతు ఆత్మహత్యలు ఉండేవని ఆయన దుయ్యబట్టారు.  కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తాం  అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 10 రేట్లు పెంచామని….బీడీ కార్మికులు, ఒంటరి మహిళకు దేశంలోనే తొలిసారిగా పింఛన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.