IT Raids In Hyderabad : హైదరాబాద్ లో ఐటీ దాడులు.. ఎక్సెల్ కంపెనీ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లు సీజ్

హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ అడ్మిన్, అకౌంట్ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

IT Raids In Hyderabad : హైదరాబాద్ లో ఐటీ దాడులు.. ఎక్సెల్ కంపెనీ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లు సీజ్

IT RAIDS

IT raids in Hyderabad : హైదరాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని పలు చోట్ల 40 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎక్సెల్ టైర్ల కంపెనీతోపాటు ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

బాచుపల్లి, చందానగర్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 40 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాతున్నాయి.

IT Raids On Bogus Political Parties : దేశవ్యాప్తంగా బోగస్ రాజకీయ పార్టీలపై ఐటీ దాడులు .. రూ.కోట్ల విరాళాలు సేకరిస్తున్న పార్టీలకు చెక్

బాచుపల్లిలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ అడ్మిన్, అకౌంట్ ఆఫీసుల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెన్నైలోని హెడ్ క్వార్టర్స్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.