ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవొచ్చు : హైకోర్టు

  • Published By: srihari ,Published On : May 20, 2020 / 01:21 PM IST
ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు చేయించుకోవొచ్చు : హైకోర్టు

తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు సీరియస్ అయింది. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లోనే కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోవడం ప్రజల హక్కుగా పేర్కొంది. కరోనా సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లు ఐసీఎమ్ ఆర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సదుపాయాలు పరిశీలించాక ఐసీఎమ్ ఆర్ ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం గాంధీ, నిమ్స్ ప్రధానంగా గవర్నమెంట్ ఆస్పత్రుల్లోనే కరోనా టెస్టులు చేస్తున్నారు. మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్టులు ఎందుకు చేయడం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రైవేట్ కేంద్రాల్లోనూ డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోవడం ప్రజల హక్కుగా హైకోర్టు భావిస్తోంది. 

ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోవడం ప్రజల హక్కని, అదే విధంగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లు నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది.

ఒకవేళ కరోనా సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లు, ఐసీఎమ్ ఆర్ కు సంబంధించి దరఖాస్తులు చేసుకుని, ఐసీఎమ్ ఆర్ సూచించిన గైడ్ లైన్స్ ఫాలో కావాలని కూడా కోర్టు పేర్కొంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్ సిబ్బంది సదుపాయాలు సూచిన తర్వాత ఐసీఎమ్ ఆర్ వాటన్నిటినీ పరీశిలించి ఒక నోటిఫై అందించే విధంగా 
చూడాలని సూచించింది. 

ఐసీఎమ్ ఆర్ అనుమతించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు డబ్బులు చెల్లించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎమ్ ఆర్ గైడ్ లైన్స్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు చేసుకునే విధంగా చూడాలని హైకోర్టు తెలిపింది.