హత్య కేసులో కోడిపుంజు అరెస్ట్, అసలేం జరిగిందంటే..

హత్య కేసులో కోడిపుంజు అరెస్ట్, అసలేం జరిగిందంటే..

jagtial police arrest cock in murder case: మనిషి కోసుకుని కూర వండుకుని తినే కోడిపుంజు.. మనిషిని చంపడమేంటి? హత్య కేసులో పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లడం ఏంటి? నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అంతా అయోమయంగా ఉంది కదూ.. మ్యాటర్ ఏంటంటే.. జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి మృతికి కోడి కారణమైంది. కోడి కాలికి కట్టిన కత్తి ప్రమాదవశాత్తు వ్యక్తి మర్మాంగాలకు తగిలి అతడు మరణించాడు.

Bird kills man at cockfight: కోడి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1 ముద్దాయిగా చేర్చారు.. అసలు విషయం ఏంటంటే..? - Cock arrest in jagtial in a murder case | TV9 Telugu

కోడి కత్తి తగిలి మృతి:
జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్.. పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. తొత్తునూరు శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీష్ (45) ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాడు. కోడి కాలికి కత్తి కట్టేపనిలో పడ్డాడు. ఆ సమయంలో అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

Bird kills man at cockfight: కోడి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1 ముద్దాయిగా చేర్చారు.. అసలు విషయం ఏంటంటే..? - Cock arrest in jagtial in a murder case | TV9 Telugu

మర్మాంగాలకు గుచ్చుకున్న కోడికత్తి:
ఈ క్రమంలో ఆ కత్తి… సతీష్ మర్మాంగాలకు( పురుషాంగానికి, వృషణాలకు) తగలగా తీవ్ర గాయాలతో సతీష్ అక్కడే కుప్పకూలాడు. అక్కడున్న వారు వెంటనే బాధితుడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా… మార్గం మధ్యలోనే సతీష్ ప్రాణాలు వదిలాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. సతీష్​ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. ఆ కోడిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు.

వ్యక్తి హత్య కేసులో కోడి అరెస్టు

కోడిని అరెస్ట్ చెయ్యలేదు:
దీంతో హత్య కేసులో కోడిని పోలీసులు అరెస్ట్ చేశారు? అదుపులోకి తీసుకున్నారు? పోలీస్ స్టేషన్ లో బంధించారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై గొల్లపల్లి ఎస్ఐ జీవన్ స్పందించారు. వ్యక్తి మరణించిన ఘటనలో కోడిని అరెస్ట్​ చేశారన్న వార్తలను ఎస్ఐ ఖండించారు. ”దర్యాప్తులో భాగంగా ఆ కోడిని సంరక్షించే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. ఆ కోడిని సంరక్షించేందుకే ఠాణాకు తీసుకొచ్చారు. తర్వాత కోడిని కోళ్ల ఫారంలో అప్పగించారు. అంతేకాని కోడిని అరెస్ట్ చేయడం కానీ, అదుపులోకి తీసుకోవడం కాని జరగలేదని” స్పష్టం చేశారు.

కాగా, కోడి రాజాను పోలీస్ స్టేషన్‌లో కాసేపు కట్టేశారు. కాసేపు సెల్‌లో, మరికాసేపు చెట్టుకిందకు మార్చారు. అక్కడున్నంత సేపు కోడి తెగ హడావుడి చేసింది. తన స్వేచ్ఛను కోల్పోయినట్టు ఫీల్ అయ్యిదో ఏమో కానీ.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తించింది. కోడిని కంటికిరెప్పలా చూసుకునేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. దానికి తిండి, నీరు పెట్టలేక అగచాట్లు పడ్డారు.