Oxygen High Prices : ఆక్సిజన్ ను అధిక ధరలకు అమ్మితే జైలుకే

ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

Oxygen High Prices : ఆక్సిజన్ ను అధిక ధరలకు అమ్మితే జైలుకే

Oxygen High Prices

oxygen at high prices : ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతస్థాయి సమాచారం మేరకు జిల్లాలో ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు.

ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపటమే కాక సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై జిల్లా పరిషత్ సిఈఓ ఆధ్వర్యంలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, స్థానిక తాసిల్దార్, వన్ టౌన్ సిఐలతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు.

ఎవరైనా ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిసినట్లయితే అటువంటి వారిని జైలుకు పంపిండంతోపాటు వారి లైసెన్సులను రద్దు చేసి, తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ విపత్కర పరిస్థితులలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నివారణ చట్టం కింద తీవ్రమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు కలెక్టర్, ఎస్పీలు వెల్లడించారు.