Pawan Kalyan Telangana Tour : త్వరలో.. తెలంగాణ పర్యటనకు పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. వారం పది రోజుల్లో పవన్ కల్యాణ్ పర్యటన..

Pawan Kalyan Telangana Tour : త్వరలో.. తెలంగాణ పర్యటనకు పవన్ కల్యాణ్

Pawan Kalyan Telangana Tour

Pawan Kalyan Telangana Tour : రైతు భరోసా యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపైనా ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని నిర్ణయించిన జనసేనాని పవన్ కల్యాణ్.. త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన జనసైనికుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. వారం పది రోజుల్లో చౌటుప్పల్, హుజూర్ నగర్ లో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని జనసేన నేతలు తెలిపారు.

తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలంగాణలో క్రియాశీలక సభ్యత్వ నమోదుపైనా జనసేన పార్టీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. పవన్ తెలంగాణ పర్యటనకు సంబంధించి ఓ లేఖను విడుదల చేసింది జనసేన పార్టీ.

రైతు భరోసా యాత్ర పేరుతో ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. నేరుగా మృతుల కుటుంబాలు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం, ఆర్థిక సాయం అందించడమే కాదు తాను అండగా ఉంటానని భరోసా కూడా ఇస్తున్నారు.

Pawan Kalyan : అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : పవన్

తొలుత అనంతపురం జిల్లా నుంచి తన యాత్రను ప్రారంభించారు పవన్ కల్యాణ్. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు పవన్ కల్యాణ్. సమాచార హక్కు చట్టం ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలను సేకరించిన జనసేన పార్టీ.. ఆ జాభితా ఆధారంగానే వారి కుటుంబాలకు ఆర్ధికసాయం అందిస్తున్నట్లు తెలిపింది. మొదటి విడతలో 80 మంది రైతులకు సాయం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

పనిలో పనిగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు పవన్ కల్యాణ్. జగన్ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు పవన్. పంటల దిగుబడి రాక.. అప్పుల పాలై.. ప్రభుత్వ ఆదుకోకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పవన్ వాపోయారు. అలాంటి రైతు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.

యాత్రలో భాగంగా రైతు సమస్యలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైందని అడిగారు. ఇప్పటి వరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Pawan Kalyan : 2024లో మేం అధికారంలోకి వస్తాం.. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చేప్రసక్తే లేదు : పవన్

పంటకు పెట్టుబడి లేదు.. రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు.. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు, పండిన పంటను తీసుకుని కూడా డబ్బులు ఇవ్వరని పవన్ ఫైరయ్యారు. ఏ దశలోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడటం లేదని మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులను కూడా కులాల వారీగా విభజించడమే ప్రభుత్వం చేసిన పనంటూ ధ్వజమెత్తారు పవన్.