Pawan Kalyan Kondagattu : నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. వారాహికి ప్రత్యేక పూజలు

నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Pawan Kalyan Kondagattu : నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. వారాహికి ప్రత్యేక పూజలు

pawan

Pawan Kalyan Kondagattu : నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఆయన కొండగట్టుకు బయలుదేరనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే వారాహి వాహనం కొండగట్టుకు చేరుకుంది. పూజలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టులో జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించి దిశానిర్ధేశం చేస్తారు. నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. కొండగట్టులో పూజలు, నాచుపల్లిలో పార్టీ నేతలతో మీటింగ్ తర్వాత అదే రోజున నారసింహ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు.

Tirumala Drone : తిరుమలలో డ్రోన్ కలకలం.. త్వరలో కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ-టీటీడీ కీలక నిర్ణయం

32 నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీలక్ష్మీ నారసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. ధర్మపురిలో సాయంత్రం 5 గంటలకు జనసేన కార్యదర్శులతో పవన్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.