తెలంగాణకు భయం లేదు… కరోనా సెకండ్ స్టేజ్ కి వెళ్లలేదు

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 02:44 PM IST
తెలంగాణకు భయం లేదు… కరోనా సెకండ్ స్టేజ్ కి వెళ్లలేదు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22, 2020) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్ఛందంగా రోజంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేస్తున్నారు. తెలంగాణలో మెట్రో సర్వీసులను కూడా నిలిపివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కూడా బంద్ చేసింది. 

రేపటి జనతా బంద్ చాలా కీలక ఘట్టమని హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ కరోనా సెకండ్ స్టేజ్ లోకి వెళ్లలేదని చెప్పారు. ఈ మేరకు శనివారం (మార్చి 21, 2020) ఆయన 10టివి  ఇప్పటివరకు 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్ కేసు దుబాయ్ నుంచి వచ్చిన తండ్రి ద్వారా కొడుక్కి వచ్చిందన్నారు. కరీంనగర్ లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ప్రైమరీ కాంటాక్ట్ పరిసరాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం (మార్చి 22, 2020) ఉదయం 6 గంటల నుంచి తెలంగాణ జనతా కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు. వైరస్ లక్షణాలుంటే ఐసోలేషన్ కు తరలిస్తామన్నారు. వైరస్ లేకుంటే మందులిచ్చి పంపించి వేస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పారు. జలులు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు.  

తెలంగాణలో ఆర్టీసీ బస్సులను కూడా బంద్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. కేవలం డిపోకు 5 బస్సులు స్టాండ్ బైగా ఉంచుతామన్నారు. వర్తక, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను రాష్ట్రంలోకి రానివ్వమని అన్నారు. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేస్తామన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయల షాపులు, పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చునని కేసీఆర్ చెప్పారు.