Job Calender : ఇకపై ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌ : కేసీఆర్‌

ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది.

Job Calender : ఇకపై ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌ : కేసీఆర్‌

Job Calender Will Be Released From Every Year, Says Kcr (1)

KCR Job Calender : ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మరోసారి సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ తయారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై ఇవాళ కూడా మంత్రివర్గం చర్చించనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. కొత్త జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్‌ ఆదేశించింది. గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు కేబినెట్‌కు నివేదిక సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్టు చేయాలన్నారు. హైదరాబాద్‌ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించారు. తక్షణమే అదనంగా 12వందల కోట్లను సీఎం మంజూరు చేశారు.