Joker Software : జోకర్‌‌తో జాగ్రత్త, ఓపెన్ చేశారా అంతే సంగతులు

జోకర్ వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ మాల్ వేర్ బారిన పడిన యువత..తీవ్రంగా నష్టపోతోంది. గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసినా..మెట్రో నగరాలను ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది.

Joker Software : జోకర్‌‌తో జాగ్రత్త, ఓపెన్ చేశారా అంతే సంగతులు

Joker

Joker Software : సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. మనకు తెలియకుండానే..అకౌంట్ల నుంచి డబ్బులు మాయమై పోతున్నాయి. ఏదో ఒక లింక్ పంపించి..అది క్లిక్ చేయాలని..గిఫ్ట్ లు..ఇతరత్రా విలువైన వస్తువులు వస్తాయని నమ్మబలికి మోసగొడుతున్నారు. తాజాగా..జోకర్ వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ మాల్ వేర్ బారిన పడిన యువత..తీవ్రంగా నష్టపోతోంది. గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసినా..మెట్రో నగరాలను ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది.

మొబైల్స్‌, డెస్క్‌టాప్‌లో ఇది ప్రత్యక్షమవుతోంది. పొరపాటున జోకర్ ఓపెన్ చేసినట్లయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవాల్సిందేనని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. బ్యాంకు వివరాల నుంచి వ్యక్తిగత ఫోటోల వరకు మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని అన్నారు. జోకర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని సీపీ అంజనీ కుమార్‌ సూచించారు.

ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు రకరకాల టెక్నాలజీనీ వాడుకుంటూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మొబైల్‌ నెంబర్‌కు లింక్‌లతో కూడిన మెసేజ్‌లు పంపిస్తున్నారని… పొరపాటున ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే తీవ్రంగా మోసపోవాల్సిందేనని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాల విషయంలో, వ్యక్తిగత వివరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.