TNR Last Words : కరోనా ఏమీ చేయదని అందరికీ ధైర్యం చెప్పారు.. చివరికి.. కన్నీళ్లు పెట్టిస్తున్న టీఆఎన్ఆర్ ఆఖరి వీడియో

ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. తన టాక్ షో తో ఎంతో ఫేమస్ అయిన ఆయన... చివరగా కరోనా గురించే మాట్లాడారు. వైరస్ ఏమీ చేయదని అందరికీ భరోసానిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా చేయాలని, ధైర్యంగా ఉండాలని ఆ వీడియోలో టీఎన్ఆర్ చెప్పిన ఆఖరి మాటలను అందరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

TNR Last Words : కరోనా ఏమీ చేయదని అందరికీ ధైర్యం చెప్పారు.. చివరికి.. కన్నీళ్లు పెట్టిస్తున్న టీఆఎన్ఆర్ ఆఖరి వీడియో

Tnr Last Words

TNR Last Words : ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. తన టాక్ షో తో ఎంతో ఫేమస్ అయిన ఆయన… చివరగా కరోనా గురించే మాట్లాడారు. వైరస్ ఏమీ చేయదని అందరికీ భరోసానిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా చేయాలని, ధైర్యంగా ఉండాలని ఆ వీడియోలో టీఎన్ఆర్ చెప్పిన ఆఖరి మాటలను అందరికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కరోనా కల్లోల పరిస్థితులపై టీఎన్‌ఆర్‌ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. ఆ వీడియోలో టీఎన్‌ఆర్‌ ఏమన్నారంటే..

‘నేను టీఎన్‌ఆర్‌. స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన స్టే హోమ్ చాలెంజ్ ని స్వీకరిస్తున్నా. వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నా. ఎక్కడికీ వెళ్లడం లేదు. మంచి పుస్తకాలు చదువుతున్నా. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని మన పెద్దలు చెబుతారు. ఈ కష్ట సమయమన్నది నాకు మంచి అలవాటు నేర్పింది. అదే ప్రాణాయామం.. యోగా. రోజూ ప్రాణాయామం చేస్తున్నా. నా పిల్లలతో కూడా చేయిస్తున్నా. ఈ సమయంలో పిల్లలతో బాగా గడపండి. వాళ్లకు మంచి విషయాలు చెప్పండి. భవిష్యత్‌లో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో వివరించండి. వాళ్ల పనులు వాళ్లే సొంతంగా చేసుకునేలా తీర్చిదిద్దండి. ఈ కరోనా సమయంలో కొంతమందితో మాట్లాడాను. వాళ్ల ఇంట్లో ఉండే పెద్దవాళ్లు చాలా భయపడుతున్నారు. అది మంచిది కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో ఉంటే కరోనా ఏమీ చేయదు. దయచేసి రూమర్స్‌ నమ్మకండి. నెగెటివ్‌ వీడియోస్‌ చూడకండి. కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకోండి. మనం మానసికంగా కుంగిపోతే, మన ఇమ్యూనిటీ పవర్‌ కూడా తగ్గిపోతుంది. ఇందుకోసం ప్రాణాయామం చేయాలి. అందరూ జాగ్రత్తలు పాటిస్తూ, కరోనాను జయిద్దాం’’ అని టీఎన్‌ఆర్‌ చెప్పుకొచ్చారు.

యోగా, ప్రాణాయామం చేయటం, ఇమ్యూనిటీ పెంచుకోవటం, ధైర్యంగా ఉండటం ద్వారా కరోనాను జయించవచ్చని టీఎన్‌ఆర్‌ ఈ వీడియోలో వివరించారు. అలాంటి వ్యక్తిని అదే కరోనా బలితీసుకోవడం అందరి హృదయాలను కలచి వేస్తోంది.