Jubilee Hills Rape Case: రాజీనామా చేయాలని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కు టీఆర్ఎస్ ఆదేశం..చేసేదేలేదంటున్న మసీవుల్లా

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కు రాజీనామా చేయాలని టీఆర్ఎస్ ఆదేశించింది. కానీ చైర్మన్ మసీవుల్లా మాత్రం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.

Jubilee Hills Rape Case: రాజీనామా చేయాలని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కు టీఆర్ఎస్ ఆదేశం..చేసేదేలేదంటున్న మసీవుల్లా

Jubilee Hills Rape Case

Jubilee Hills Rape Case : హైదరాబాద్ అమినేషియా పబ్ వ్యవహారం విషయం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. బాలిక రేప్ కు గురి కావటం..ఈ ఘటనలో పలువురు రాజకీయ నేతల వ్యక్తులు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు పిల్లలు ఉండటంతో పార్టీపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. కానీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా తెగేసి చెబుతున్నారు. తనను పదవి నుంచి ఎవ్వరూ తప్పించలేరు అంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు మసీవుల్లా. కానీ మసీవుల్లాకు నచ్చ చెప్పి ఎలాగైనా రాజీనామా చేయించేలా చేయటానికి హోమంత్రి మహబూద్ అలీ యత్నాలు ప్రారంభించారు. అమినేషియా పబ్ రేప్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా కుమారుడు కూడా నిందితుడిగా ఉన్నాడు. దీంతో విపక్షాలు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్నాయి.

తమ నాయకుల పిల్లలను టీఆర్ఎస్ కాపాడటానికి ఈ కేసు నుంచి తప్పించటానికి యత్నిస్తోంది అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ చర్యలు తీసుకునేయత్నంలో భాగంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్న మసీవుల్లాను పదవికి రాజీనామా చేయమని ఆదేశించింది. కానీ మసీవుల్లా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కరాఖండీగా తేల్చి చెబుతున్నారు. దీంతో హోంమంత్రి ఆయనతో రాజీనామా చేయించే యత్నాలు చేపట్టారు. రేప్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా కొడుకు పాత్ర ఉండటంతో విపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో నిరసనలు చేపట్టాయి. అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు ఉండటం వల్లనే కేసును నీరుకారుస్తున్నారంటూ విమర్శిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా..ఇన్ని విమర్శలు వస్తున్నా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్న నసీవుల్లా మాత్రం నోరు మెదపటంలేదు. ఆయన నుంచి ఎటువంటి స్పందనా రావటంలేదు. దీంతో విపక్షాలు మరింతగా విమర్శలు సంధిస్తున్నాయి.కాగా..వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నసీవుల్లా నియామకం అయ్యాక సొంతపార్టీలోని కొంమంది నేతలు ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

కాగా..జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యచార ఘటనలో పోలీసు కస్టడీలో సాగే నిందితుడి విచారణ కీలకం కానుంది.నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు.

తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తారు. దీనిలో భాగంగా అమ్నేషియా పబ్, కాన్ సీ యూ బేకరితోపాటు అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్తారు. నేరం చేసిన తర్వాత ఇన్నోవా కారును దాచిపెట్టిన ప్రదేశానికి కూడా తీసుకెళ్తారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన నిందితులు ఎక్కువ మంది మైనర్లే కావడంతో, వాళ్లకు ప్రభుత్వ వైద్యులతో లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహిస్తారు. చార్జిషీటు దాఖలుకు ఈ పరీక్ష కీలకం కావడంతో దీనికి కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అలాగే అత్యాచార ఘటనలో వాడిన ఇన్నోవా కారులో సాక్ష్యాలను తారుమారు చేశారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ట్రయల్ సమయంలో ఈ కేసులో నిందితులను మేజర్‌లుగా గుర్తించాలని పోలీసులు.. జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత ఐదుగురిని మేజర్‌లుగా పరిగణించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీనిపై చట్టపరంగా జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు. మైనర్ల మానసిక స్థితి, నేరం చేసేందుకు వాళ్లకు ఉన్న సామర్ధ్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జువైనల్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారు. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్ హోం నుంచి సాధారణ జైలుకు తరలిస్తారు.