Jubilee Hils : వీరు మారరా ? పొద్దున్నే తాగేసి.. కారుతో ర్యాష్ డ్రైవింగ్

జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం మద్యం సేవించిన ఓ యువకుడు.. కారుతో ర్యాష్‌ డ్రైవింగ్ చేశాడు...

Jubilee Hils : వీరు మారరా ? పొద్దున్నే తాగేసి.. కారుతో ర్యాష్ డ్రైవింగ్

Drunk And Drive

Jubilee Hils Drunk And Drive Incident : తాగి బండి నడపవద్దు..అని ఎంత మొత్తుకున్నా.. కొంతమంది మందుబాబులు వినిపించుకోవడం లేదు. ప్రాణాలే తీయడమే కాకుండా..ఇతర ప్రాణాలను తీస్తున్నారు మందుబాబులు. పీకలదాక మద్యం సేవించి..వాహనాలను రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు వీకెండ్ వేళ, హఠాత్తుగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్ని చేస్తున్నా మందుబాబుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

Read More : Vikarabad : వికారాబాద్ బాలిక కేసు.. చంపింది తల్లా ? ప్రియుడా ?

ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో తాగుబోతులు తమ ర్యాష్‌ డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టిస్తున్నారు.. ఫుల్‌గా మద్యం సేవించి ఓవర్‌ స్పీడ్‌తో నడుపుతూ వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మందుబాబుల వీరంగంతో పలువురు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు గాయపడ్డారు. ఉదయం, పగలు, రాత్రి అనే తేడా లేదు. ఫుల్ గా మందు కొట్టి.. వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్నారు. నషాలకెక్కిన కిక్కుతో ఎలా నడుపుతున్నారో వారికే అర్థం కావడం లేదు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read More : US : అమెరికాలో ఢీకొన్న 50 వాహనాలు..ముగ్గురు మృతి

తాజాగా… జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. 2022, మార్చి 29వ తేదీ మంగళవారం ఉదయం మద్యం సేవించిన ఓ యువకుడు.. కారుతో ర్యాష్‌ డ్రైవింగ్ చేశాడు. చెక్‌పోస్టు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. ముందుగా వెళుతున్న కారును, ఆటోతో పాటు రెండు బైక్ లను ఢీకొట్టాడు. కారు ఢీకొట్టిన వేగానికి ఆటో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన వారిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుల్ గా కిక్కుతో ఉన్న ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న వాహనాలను తొలగించారు. కారు బీభత్సంతో ట్రాఫిక్ కొద్దిసేపు స్తంభించిపోయింది.