జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధిక ఫీజులు వసూలు.. తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని అడ్డుకున్న యాజమాన్యం

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 11:49 PM IST
జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధిక ఫీజులు వసూలు.. తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని అడ్డుకున్న యాజమాన్యం

హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో తనిఖీల కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారిని యాజమాన్యం అడ్డుకుంది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేసేందుకు డీఇఓతో సహా పలువురు అధికారులు జెపియస్ కు వెళ్లారు. అది గమనించిన స్కూల్ యాజమాన్యం వారిని లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. యూనిఫాం, ట్రాన్స్ పోర్ట్ ఫీజులు చెల్లిస్తేనే ఆన్ లైన్ క్లాసులకు లింకు ఇస్తామని వారు షరతులు విధించారు. దీంతో తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే స్కూలుకు వెళ్లిన అధికారుల్ని యాజమాన్యం అడ్డుకుంది.

హైదరాబాద్ నగరంలోని కొన్ని కార్పోరేట్ స్కూళ్లు తమ ఇష్టారాజ్యంగా దోపిడీ తెగబడుతున్నాయి. తాజాగా జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోంది. ఆన్ లైన్ క్లాసుల లింక్ కావాలంటే గతంలో ఏ విధంగా అయితే స్కూల్ ఫీజు చెల్లించారో ఆవిధంగానే చెల్లిస్తేనే ఆన్ లైన్ క్లాసుల లింక్ ఇస్తామంటూ ఆందోళన చేసినట్టు కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చినట్టు కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కొద్ది గంటల క్రితం గతంలో చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో కూడా యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడినట్టు నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. మరొక సారి పూర్తిస్థాయిలో రికార్డులతో సహా గురువారం విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సంబంధించిన బాధితులు, బాధ్యులు రావాలని కోరారు. ఇది ఒక్కటే కాదు హైదరాబాద్ లో అధిక సంఖ్యలో కార్పోరేట్ స్కూళ్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.

గత మూడు నెలల కాలం నుండి కరోనా సమయంలో స్కూల్ కు వెళ్లలేని పరిస్థితిలో కూడా చాలా పాఠశాలలు, ఇన్ స్టిట్యూట్ లు కూడా విద్యార్థులు విద్యా బుద్ధులు మర్చిపోకుండా ఉండేందుకు ఆన్ లైన్ క్లాసులకు తెరతీశాయి. ఇందులో రకరకాల టెక్నాలజీతో ఉపయోగించుకుంటూ విద్యార్థులకు విద్యా అందించే ప్రయత్నం చేస్తోంది.