Telangana : 6న‌ సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు రాత పరీక్షలు

సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6వ తేదీన‌ రాత పరీక్ష నిర్వహించనున్నారు.

Telangana : 6న‌ సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు రాత పరీక్షలు

Telangana (5)

Telangana : రాష్ట్రంలోని పీవీ నర్సింహారావు వెటర్నరీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైసిస్ట్‌ పోస్టులకు కొద్దీ రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అప్లికేషన్ ప్రోసెస్ పూర్తైంది. ఇక పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఈ నెల 6వ తేదీన ఈ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ ప్రకటించారు.

ఈ పోస్టుల కోసం మొత్తం 5,888 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరికి రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లాల్లోని హెచ్‌ఎండీఏ పరిధిలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌ -1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌), మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ -2 (సెక్రెట్రియల్‌ ఎమిలిటీస్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)కు పరీక్షలు జరుగుతాయన్నారు.

పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని తెలిపారు. ఉదయం 9:15 గంటల లోపు, మధ్యాహ్నం 1:15 గంటల్లోపు మాత్రమే పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు సమయానికి ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.