Telangana Politics : కేసీఆర్ ని గద్దె దించేందుకు కొత్త ఫోర్స్ రాబోతుందా.. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ఏకమవుతాయా?

పార్టీ పెట్టడం కంటే ముందు.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడం మీద ఫోకస్ పెట్టారు పెట్టారు పొంగులేటి, జూపల్లి.

Telangana Politics : కేసీఆర్ ని గద్దె దించేందుకు కొత్త ఫోర్స్ రాబోతుందా.. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ఏకమవుతాయా?

Telangana Politics New Force: దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా.. కేసీఆర్ (KCR) కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ ని సీఎం పీఠం (CM Chair) నుంచి దించడమే లక్ష్యంగా.. తెలంగాణ రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయ్. ఇప్పటికే.. కాంగ్రెస్, బీజేపీ (BJP).. బీఆర్ఎస్ ని అధికారానికి దూరం చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయ్. ఇప్పుడు వీటితో పాటు రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దె దించేందుకు కొత్త ఫోర్స్ పురుడు పోసుకోబోతుందనే టాక్.. హాట్ టాపిట్ (hot topic) గా మారింది. బీఆర్ఎస్ (BRS Party) వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే ఈ ఫోర్స్ మెయిన్ ఎజెండాగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడమే ఈ ఫోర్స్ ప్లానా? తేల్చేద్దాం.. క్లియర్ కట్ గా

తెలంగాణ పాలిటిక్స్ఎప్పుడెలా మారుతున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. ఏదైతే జరుగుతుందనుకుంటున్నామో.. అది జరగటం లేదు. కచ్చితంగా ఇది జరిగి తీరుతుందని ఫిక్స్ అయితే.. అది వాయిదా పడుతోంది. తర్వాత.. దాని గురించి పక్కా సమాచారమేంటో బయటకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కారు దిగేసి.. స్టేట్ పొలిటికల్ జంక్షన్లో నిల్చున్నారు. ఈ ఇద్దరు నేతలను చేర్చుకునేందుకు.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేశాయ్. వీళ్లను చూసి మరికొందరు అసమ్మతి నేతలు, అసంతృప్త నాయకులు తమ పార్టీలోకి వస్తారని భావించాయ్. వాళ్లు మాత్రం నాన్చి.. నాన్చి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా అని చెప్పారు.

కర్ణాటక ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలవడంతో.. హస్తం వైపే చూస్తున్నారనే సమాచారం వచ్చింది. కాంగ్రెస్ లో చేరికకు తెలంగాణా ఆవిర్భావదినమే ముహూర్తం అనే టాక్ కూడా వినిపించింది. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరతారని ప్రచారం జరిగింది. తర్వాత.. ముహూర్తం బలంతో ఈ ఇద్దరు నేతలు జూన్ 8న కాంగ్రెస్ లో చేరడం ఖాయమన్నారు. కానీ.. ఇప్పుడు మళ్లీ దానిపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరే లోపే కేసీఆర్ ని గద్దె దించేందుకు ఓ కొత్త ఫోర్స్ తయారుచేసే పనిలో ఈ ఇద్దరు నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ దానిమీదే చర్చ జరుగుతోంది.

Also Read: తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

పొంగులేటి, జూపల్లి కలిసి ఓ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. కానీ పార్టీ పెట్టాలా? లేదంటే ఏం చేయాలి ? అనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ పెట్టడం కంటే ముందు.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడం మీద ఫోకస్ పెట్టారు పెట్టారు పొంగులేటి, జూపల్లి. ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్లందరినీ.. ఒకే తాటి మీదకు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సహా మిగతా పార్టీల్లో ఉన్న అసంతృప్త, అసమ్మతి నేతలందరినీ ఏకం చేయడం, కోదండరాం, షర్మిల, బీఎస్పీ లాంటి పార్టీలతోనూ మాట్లాడి.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుట్ర : మహేష్ కుమార్ గౌడ్

అంతా కలిస్తేనే.. కేసీఆర్ ని ఎదుర్కోవడం సులభమవుతుందనే లెక్కల్లో ఉన్నారు. ఇందుకోసం.. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న లీడర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు. తమతో పాటు కలిసొచ్చేదెవరు? కేసీఆర్ ని, బీఆర్ఎస్ని ఎదుర్కోగలిగే బలం ఉన్న వాళ్లెవరు అన్నదానిపై.. లెక్కలేసుకుంటున్నారు.

కేసీఆర్ వ్యతిరేక ఫోర్స్ వస్తే రాజకీయం ఎలా మారుతుంది.. వివరాలకు ఈ వీడియో చూడండి.