K A Paul meet Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు

K A Paul meet Amit Shah: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించింది. గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన పాల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ విషయాల గురించి అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అమిత్ షాతో భేటీ అనంతరం..మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..అమిత్ షాతో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణలో తనపై జరిగిన దాడిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ హస్తముందని ఆరోపించిన పాల్..ఆ దాడి తాలూకు పరిణామాలు త్వరలోనే వారు చూస్తారని అన్నారు. దాడి ఘటనను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని, భాద్యులపై చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు తాను ఇదివరకెన్నడూ చూడలేదని..కేసీఆర్, కేటీఆర్ పాలనలో తెలంగాణలో రూ.లక్షల కోట్లు అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు.
Also read:13th Century Fort: భూమిలోపల భారీ కోట: అరుణాచల్ ప్రదేశ్‌లో తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దపు కోట
రెండు తెలుగు రాష్ట్రల్లో సంక్షేమం పేరుతో జరుగుతున్న ఆర్ధిక కార్యకలాపాల ద్వారా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అప్పు 8 లక్షల కోట్లుంటే.. తెలంగాణ అప్పు 4 లక్షల కోట్లు ఉందని..రాష్ట్రాలు ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే..దేశం మరో శ్రీలంకలాగా తయారవుతుందని అమిత్ షాతో అన్నట్టు పాల్ వివరించారు. ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీని కలవాలని అమిత్ షా తనకు సూచించారని కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న కేఏ పాల్..కేంద్ర హోంమంత్రి అడిగిన వెంటనే కలిసేందుకు రమ్మన్నారని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాశాంతి పార్టీ అని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయనుందని కేఏ పాల్ పేర్కొన్నారు.
Also Read:PM Modi: డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరం: మోదీ
- The Kashmir Files: అంతగా చూడాల్సిన సినిమా అయితే ఉచితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి: అరవింద్ కేజ్రీవాల్
- Uttarakhand CM: ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ: సోమావారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం
- Atchannaidu: తన ఫ్యాక్షన్ బుద్ధిని జగన్ రెడ్డి రాష్ట్ర మంతా ఎక్కిస్తున్నారు: అచ్చెన్నాయుడు
- Bandi Sanjay: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు అడ్డుకట్టవేస్తాం: బీజేపీ బండి సంజయ్
- Ayyanna Patrudu: ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది: చింతకాయల రాజేష్
1IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే
2Telangana Covid Report Update : తెలంగాణలో కరోనా.. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ
3IPL2022 DelhiCapitals Vs PBKS : మెరిసిన మార్ష్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..
4Corbevax Vaccine: రూ.590 తగ్గిన వ్యాక్సిన్ ధర.. ఇప్పుడు రూ.250 మాత్రమే
5Principal to touch student’s feet: స్టూడెంట్స్ రౌడీయిజం.. విద్యార్థిని కాళ్లు పట్టుకుని ప్రిన్సిపాల్ క్షమాపణలు!
6Viral News: వరుడు కావాలంటూ ప్లకార్డుతో రోడ్డెక్కిన యువతి
7Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు
8Shivling Idol: శివలింగం కేవలం హిందువులకు సంబంధించనదేనా..
9Uttar Pradesh : పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు
10Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!