9Years Of Modi Government: చైనా కూడా కొట్టుమిట్టాడుతోంది.. మన దేశం మాత్రం…: లక్ష్మణ్

9Years Of Modi Government: చైనా కూడా కొట్టుమిట్టాడుతోంది.. మన దేశం మాత్రం…: లక్ష్మణ్

BJP MP Laxman

9Years Of Modi Government – K Laxman: సమాజంలోని అన్నివర్గాలను తాము కలుస్తున్నామని, తొమ్మిదేళ్ల ప్రధాని మోదీ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ తెలగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

చైనా కూడా మాంద్యంతో కొట్టుమిట్టాడుతోందని, ద్రవ్యోల్బణం తగ్గి వృద్ధి రేటు పెరిగిందని చెప్పారు. ఇదే సమయంలో ప్రపంచంలోనే భారత్ అయిదవ అతి పెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని చెప్పారు. ఎన్నో అడ్డంకులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వచ్చినా కూడా మోదీ నాయకత్వంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల జాబితాలో పదవ స్థానం నుంచి అయిదవ స్థానానికి ఎగబాకామని అన్నారు.

పెద్ద దేశాలు అనుకునే దేశాలు కొన్ని ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. జీఎస్టీ గురించి కొందరు తప్పుగా మాట్లాడారని, కానీ మోదీ విజయం సాధించారని చెప్పారు. పారదర్శకమైన విధానాల వల్లనే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రాలకు కూడా ఆదాయ మార్గాలు పెరిగాయని అన్నారు. నెలకు లక్షన్నర కోట్ల రూపాయల జీఎస్టీ వస్తోందని తెలిపారు.

కార్పొరేట్ పన్నులు వసూళ్లు పెరిగాయని, ఎఫ్‌మైఢలు పోటీ పడి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. రక్షణ రంగంలో కూడా భారత్ పెట్టుబడులు సాధించి ఎగుమతులు చేయగలగడం ఒక చరిత్ర అని చెప్పారు. మొబైల్ ఎగుమతుల్లో రెండో దేశంగా మారిందని తెలిపారు. స్టార్టప్ పెట్టుబడులు పెరిగాయని అన్నారు. 40 కోట్ల మందికి ముద్ర లోన్స్ వచ్చాయని తెలిపారు.

నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయి?
తెలంగాణ వస్తే ఆత్మగౌరవం, కొలువులు, నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని, మరి అవి ఏమయ్యాయని కె లక్ష్మణ్ నిలదీశారు. దళితులను మొదట మోసం చేశారని అన్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో బీఆర్ఎస్ పై గొప్పలు చెప్పుకుంటూ యాడ్స్ ఇస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. లక్షా 27 వేలు ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Arvind Kejriwal: విపక్షాలు ఈ పనిచేస్తే 2024 ఎన్నికల తర్వాత మోదీ అధికారంలో ఉండరు: కేజ్రీవాల్