PM MITRA : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌…పీఎం మిత్రపై తెలంగాణ ఆశలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాను ప్రతిపాదించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులు అందించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది.

PM MITRA : కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌…పీఎం మిత్రపై తెలంగాణ ఆశలు..!

Pm Mitra

Kakatiya Mega Textile Park : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాను ప్రతిపాదించిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులు అందించాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గం తాజాగా ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరెల్‌ పార్క్‌ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పీఎం మిత్ర పథకంపైనే ఇప్పుడు రాష్ట్ర సర్కారు గంపెడాశలు పెట్టుకుంది.

పీఎం మిత్ర పథకం కింద 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు చేయనుంది. వచ్చే ఐదేళ్లలో దీనిపై 4 వేల 445 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తాము గతంలో పంపించిన ప్రతిపాదనలు పీఎం మిత్ర పథకంలో చేర్చాలని, సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం ఏడు చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. చాలా రాష్ట్రాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది.

KTR Kindness: పేద విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

ఈ పథకం కింద వెయ్యి ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే గ్రీన్‌ఫీల్డ్‌ పార్కులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. లాజిస్టిక్‌ పార్కు, గిడ్డంగులు, నైపుణ్య శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్‌ సెంటర్‌, డిజైన్‌ సెంటర్‌, టెస్టింగ్‌ సెంటర్లు, కార్మికులకు వసతి గృహాలు ఇందులో ఉంటాయి. కేంద్రం కొన్ని అర్హతలను నిర్దేశించింది. ఇవన్నీ తెలంగాణకు ఉన్నాయని అంటున్నారు.

వాస్తవానికి వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కును రాష్ట్ర సర్కారు ఇదే లక్ష్యంతో ప్రారంభించింది. అక్కడ 12వందల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మరో వెయ్యి ఎకరాలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటికే యాంగ్‌వన్‌, కైటెక్స్‌, గణేశా సంస్థలకు భూములు కూడా కేటాయించింది. మరో 8 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి కూడా. మౌలిక వసతులు కల్పించేందుకు పనులు మొదలయ్యాయి.
Rajanna Sirisilla : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వెయ్యి కోట్ల రూపాయల సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఇప్పటికే అభ్యర్థించారు. కేంద్ర పథకాన్ని దీనికి వర్తింపజేయాలని కోరారు. దేశంలో మొత్తం పీఎం మిత్ర పథకం కింద పది రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అందులో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తుందా? మొండి చేయి చూపుతుందా?అనేది చూడాలి.