Kaleshwaram Project : డేంజర్ బెల్స్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బ్యారేజ్‌ల కరకట్టలకు కోత, ఊళ్లకు ఊళ్లు ఊడ్చుకుపోయే ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కరకట్టలు, వంతెనలు దెబ్బతిని బలహీనపడ్డాయి. వంతెనల పిల్లర్లు కోతకు గురై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని సత్వరం పటిష్టపరచకపోతే మరోసారి వరదలు వస్తే పరిస్థితి ఏంటి? కోతకు గురైన కరకట్టలు కొట్టుకుపోకుండా ఉంటాయా? వంతెనలు కూలిపోకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు ప్రజల మదిని తొలిచేస్తున్నాయి.

Kaleshwaram Project : డేంజర్ బెల్స్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 బ్యారేజ్‌ల కరకట్టలకు కోత, ఊళ్లకు ఊళ్లు ఊడ్చుకుపోయే ప్రమాదం

Kaleshwaram Project : ఇటీవలి గోదావరి వరదలు విలయం సృష్టించాయి. జల ప్రళయాన్ని
తలపించాయి. ఊళ్లకు ఊళ్లను ముంచేశాయి. వరద ఉధృతికి చెరువులు, డ్యామ్ లు, కరకట్టలు కొట్టుకుపోయాయి. కల్వర్టులు, రోడ్లు, వంతెనలు ప్రమాద ఘంటికలు మోగించాయి. చిన్న చిన్న కల్వర్టులు, రోడ్లు, వంతెనలే డేంజర్ బెల్స్ మోగించాయి అనుకుంటే పొరపాటే.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కరకట్టలు, వంతెనలు దెబ్బతిని బలహీనపడ్డాయి. వంతెనల పిల్లర్లు కోతకు గురై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని సత్వరం పటిష్టపరచకపోతే మరోసారి వరదలు వస్తే పరిస్థితి ఏంటి? కోతకు గురైన కరకట్టలు కొట్టుకుపోకుండా ఉంటాయా? వంతెనలు కూలిపోకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు ప్రజల మదిని తొలిచేస్తున్నాయి.

Godavari : భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం..చివరి ప్రమాద హెచ్చరిక జారీ

నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచే కుండపోత వర్షాలు కురిశాయి. మరో రెండు నెలల మాన్ సూన్ సీజన్ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వరదలు వస్తే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బ్యారేజీల కరకట్టలు, వంతెనలు తట్టుకోగలవా? అనే ప్రశ్నే అధికారులను వేధిస్తోంది. పూర్తిగా తెగిపోవడమో, కూలిపోవడమో జరిగే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న భయం వెంటాడుతోంది.

Godavari Flood : కూలుతున్న గోదావరి గట్లు.. భయాందోళనలో ప్రజలు

అంచనాలకు మించి వరదలు రావడమో, నిర్మాణ లోపమో కానీ వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ ల కరకట్టలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ బ్యారేజ్ నుంచి భారీగా విడుదల చేసిన వరద నీటితో కరకట్ట వంద మీటర్ల మేర కోతకు గురైంది. డేంజర్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

పార్వతీ బ్యారేజ్ ఒక్కటే కాదు లక్ష్మి బ్యారేజ్ కరకట్ట పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మేడిగడ్డ బ్యారేజీ కరకట్ట మహదేవ్ పూర్ మండలంలో బెగ్లూర్ దగ్గర డ్యామేజ్ అయ్యింది. మరోసారి కుండపోత వర్షాలు కురిసి ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే మాత్రం ఇవి పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ఊళ్లకు ఊళ్లే వరద నీటిలో ఊడ్చుకుపోయే ప్రమాదం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది.