Prasad Goud warned : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ప్రసాద్‌గౌడ్‌ వార్నింగ్‌..‘నీ అంతూ చూస్తానంటూ బెదిరింపు’

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంతు చూస్తానంటూ చాలా కాలంగా ప్రసాద్‌గౌడ్‌ బెదిరిస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేకి వార్నింగ్‌ ఇస్తూ ఓ వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఖబద్దార్‌ జీవన్‌రెడ్డి అంటూ హెచ్చరించాడు. జీవన్‌రెడ్డి డబ్బులిస్తే తాను లీడర్‌ కాలేదని.. తనంతట తాను ఎదిగానంటూ చెప్పుకొచ్చాడు. జీవన్‌రెడ్డికి భయపడేది లేదని.. ఆయన ఏం చేయలేరంటూ వార్నింగ్‌ ఇచ్చాడు ప్రసాద్‌గౌడ్‌. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Prasad Goud warned : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ప్రసాద్‌గౌడ్‌ వార్నింగ్‌..‘నీ అంతూ చూస్తానంటూ బెదిరింపు’

Prasad Goud warned : ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. మాక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ హత్యకు కుట్రకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంతు చూస్తానంటూ చాలా కాలంగా ప్రసాద్‌గౌడ్‌ బెదిరిస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యేకి వార్నింగ్‌ ఇస్తూ ఓ వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఖబద్దార్‌ జీవన్‌రెడ్డి అంటూ హెచ్చరించాడు. జీవన్‌రెడ్డి డబ్బులిస్తే తాను లీడర్‌ కాలేదని.. తనంతట తాను ఎదిగానంటూ చెప్పుకొచ్చాడు. జీవన్‌రెడ్డికి భయపడేది లేదని.. ఆయన ఏం చేయలేరంటూ వార్నింగ్‌ ఇచ్చాడు ప్రసాద్‌గౌడ్‌. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రసాద్‌గౌడ్‌ గతంలో మాట్లాడిన ఆడియో క్లిప్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఓ వ్యక్తికి ఫోన్‌కాల్‌ చేసిన ప్రసాద్‌గౌడ్‌.. తాను ఎవరో తెలుసుకోవాలంటూ హెచ్చరించాడు. తాను కెల్లెడి సర్పంచ్‌ అని.. అవసరమైతే ఎవరికైనా కాల్‌ చేసి తన గురించి తెలుసుకోవాలన్నాడు. అంతేకాదు.. తాను ల్యాండ్‌ డీలింగ్స్‌ చేస్తున్నానని.. కొంత డబ్బు ఇవ్వాలని కోరాడు.

‘కావాలంటే మా కెల్లెడి విలేజ్‌కు ఫోన్‌ చేసి ప్రసాద్‌గౌడ్‌ ఎవరంటే ఎవరైనా చెప్తరు. నేను కెల్లెడి సర్పంచ్‌ని మాట్లాడుతున్నా. ఒకసారి నువ్వు తెలుసుకో. ఇన్ఫర్మేషన్‌ ఎట్ల రావాలో అట్ల వస్తది. తెలుసుకో నువ్వు. అంతేకానీ ఫోన్‌ కట్‌ చేయకు. ఫోన్‌ లేపు. మాట్లాడు నాతోని. నాకు కొంచెం అవసరముంది కాబట్టే అడుగుతున్నా. కొంచెం ల్యాండ్‌ డీలింగ్స్‌ నడుస్తున్నయ్. ఫోన్‌ ఎందుకు లేపుతలేవు. కెల్లెడికి ఫోన్‌ చేసి ప్రసాద్‌గౌడ్‌ ఎవరంటే చెప్తరు. నేను కెల్లెడి సర్పంచ్‌ని. కావాలంటే చెయ్‌ ఎవరికన్నా’ అంటూ ప్రసాద్ గౌడ్ బెదిరింపులకు పాల్పడ్డారు.