Sand Mafia : ఇసుక లారీ డ్రైవర్లనుంచి డబ్బులు వసూళ్లు..నలుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్

కామారెడ్డి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమాలను అరికట్లాల్సిన పోలీసులే అక్రమాలు చేసే కేటుగాళ్లనుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న నలుగురు కానిస్టేబుల్స్ ను ఎస్పీ సస్పెండ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి డబ్బులు వసూలు చేస్తున్న బిచ్కుంద కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు.

Sand Mafia : ఇసుక లారీ డ్రైవర్లనుంచి డబ్బులు వసూళ్లు..నలుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్

Sand Mafia In Kamareddy

Sand Mafia Kamareddy : కామారెడ్డి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అక్రమాలను అరికట్లాల్సిన పోలీసులే అక్రమాలు చేసే కేటుగాళ్లనుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న నలుగురు కానిస్టేబుల్స్ ను ఎస్పీ సస్పెండ్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి డబ్బులు వసూలు చేస్తున్న బిచ్కుంద కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు.

బిచ్కుంద మండలంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక రవాణాలో పోలీసులు చేతివాటం చూపించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న సంతోష్,పరందాములుతో పాటు లేడీ కానిస్టేబుల్స్ భవిత, కళ అనే నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

Read:గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!