Karate Kalyani On ChildAdoption : చిన్నారిని దత్తత తీసుకున్నా అని చెప్పడానికి కారణమిదే-కరాటే కల్యాణి

చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్ లో తాను మాట్లాడింది వాస్తవమే అని కరాటే కల్యాణి అంగీకరించారు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించారు.(Karate Kalyani On ChildAdoption)

Karate Kalyani On ChildAdoption : చిన్నారిని దత్తత తీసుకున్నా అని చెప్పడానికి కారణమిదే-కరాటే కల్యాణి

Karate Kalyani On Childadoption

Karate Kalyani On ChildAdoption : ఐదు నెలల చిన్నారి దత్తత వివాదానికి సంబంధించి సినీ నటి కరాటే కళ్యాణి మరోసారి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఓ యూట్యూబ్ ఛానెల్ లో తాను మాట్లాడింది వాస్తవమే అని కరాటే కల్యాణి అంగీకరించారు. నన్ను చూసి చాలామంది ఇన్ స్పైర్ అవుతారనే ఉద్దేశంతోనే అలా చెప్పానన్నారు. వాస్తవానికి పాపను దత్తత తీసుకోలేదన్నారు.

చిన్నారి దత్తత విషయంలో కావాలనే తనపై కుట్ర చేసి, కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని కరాటే కళ్యాణి ఆరోపించారు. చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని, ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.(Karate Kalyani On ChildAdoption)

Karate Kalyani Key Comments On Illegal Girl Child Adoption Controversy

Karate Kalyani Key Comments On Illegal Girl Child Adoption Controversy

Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు

తనకు కలెక్టర్ నుండి కానీ, CWC(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) నుండి కానీ ఎలాంటి నోటీసులు రాలేదని కళ్యాణి తేల్చి చెప్పారు. దత్తత వ్యవహారంపై కలెక్టర్ ను కలిసి వివరణ ఇచ్చినట్టు వివరించారు. ఈరోజు CWC అధికారులు లేకపోవడంతో రేపు (బుధవారం) మళ్లీ విచారణకు హాజరవనున్నట్లు తెలిపారు. తన దగ్గరున్న పాపను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తోందని కరాటే కల్యాణి ఆరోపించారు. అలాగే అధికార పార్టీ నేతలు, అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. తాను అన్యాయాన్ని సహించనని, ఎదురిస్తానని.. అందుకే చాలామంది తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు కరాటే కళ్యాణి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంగళవారం సీడబ్ల్యూసీ కార్యాలయంలో ఆమె విచారణకు హాజరయ్యారు. కల్యాణితో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా సీడబ్లూసీ విచారణకు వచ్చారు. విచారణ అనంతరం కళ్యాణి మీడియాతో మాట్లాడారు.

karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి

”చిన్నారికి సంబంధించి ఇంత వరకూ ఎలాంటి దత్తత జరగలేదు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ ముందు కూడా చెప్పాము. ఆర్థికంగా చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉన్నాను. నాపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు’ అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చారు. కాగా యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డితో వివాదం, ఆ తర్వాత చిన్నారి దత్తత విషయం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

Karate Kalyani : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి

ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచుకుందని కరాటే కల్యాణిపై ఫిర్యాదు రావడంతో చైల్డ్‌ లైన్‌ అధికారులు రంగంలోకి దిగారు. కల్యాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోటీసులకు స్పందిచకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిణామాల అనంతరం కరాటే కల్యాణి అఙ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడం వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Karate Kalyani Key Comments On Illegal Girl Child Adoption Controversy

Karate Kalyani Key Comments On Illegal Girl Child Adoption Controversy