India in crop: జై కిసాన్..పచ్చని పొలంలో భారత్ పటం..జాతీయ జెండా ఆవిష్కరణ

ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఏర్పాటు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ రైతు. జెండాకు వందనం చేసి పొలంపనులు చేస్తు జై కిసాన్ అనిపిస్తున్నాడు.

10TV Telugu News

India map in karimnagar farmer crop : భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. జై జవాన్..జై కిసాన్ నినాదాలే భారత్ ను కాపాడుతున్నాయి. నినాదాలే కాదు పంట పండించే రైతు..దేశాన్ని కాపాడే జవాన్. ఇద్దరూ దేశానికి ఒకరు వెన్నెముక అయితే మరొకరు గుండె. అటువంటి ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఆలోచన చేశాడు. అంతేకాదు పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ రైతు. తన పొలంలో భారత్ పటాన్ని..పొలం మధ్యలో జాతీయ జెండాను ఆవిష్కరించి సంవత్సరం అంతా జెండాకు వందనం చేస్తూ పొలం పంటను పండించాలే ఏర్పాటు చేసుకున్నాడు కరీనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి.

ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు రైతు మల్లికార్జున్ రెడ్డి తన వ్యవసాయ పొలంలోనే భారత దేశ పటాన్ని రూపొందించాడు..అక్కడే జాతీయా జెండాను ఆవిష్కరించి..సంవత్సరం పొడవునా వందన సమర్పణ చేసేందుకు సిద్దమయ్యాడు. పచ్చని పంటలో భారత్ పటం. పొలం మధ్యలో జాతీయ జెండా రెపరెపలు. చూస్తుంటేనే దేశ భక్తి పొంగిపొర్లుతోంది. రోమాలు నిక్కబొడుకుంటున్నాయి.

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15 వ తేదితో 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశమంతా అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు నిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి వినూత్నంగా అలోచించి దేశ భక్తిని చాటుకుంటున్నారు. మల్లికార్జున్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయం లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అద్భుత ఫలితాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు.

అదే స్ఫూర్తి తో తన వ్యవసాయ వరి పొలంలో 20 గుంటలలో నల్లని వరితో (కాలబట్టి ) భారత దేశ చిత్రపటం వచ్చే విధంగా వరి నాటాడు. దేశపటాన్ని..జెండాను అబ్బురంగా చూస్తున్నారు. రేపటి స్వాతంత్ర్య దినోత్సం నుండి వచ్చే సంవత్సరం వరకు..సంవత్సరం పొడవునా.. జాతీయ గీతం పాడడంతోపాటు ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి..సాయంత్రం వితరణ చేస్తామని రైతు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. అయితే దీనీ ద్వారా దేశభక్తితోపాటు తాను పండిస్తున్న సేంద్రియ ఎరువుల పంటలపై కూడా ప్రజల్లో సరైన అవగాహన వస్తుందని అంటున్నారాయన. సేంద్రీయ ఎరువుల పంటలతో ఆరోగ్యంగా ఉండడమే తన లక్ష్యమని ఈ రైతన్న చెబుతున్నారు.

75 ఏళ్లు పూర్తి చేసుకున్న స్వాతంత్ర్యం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవున అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే చాలా మంది యువత స్వచ్చంద సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు అజాది అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్నారు.

×