కరీంనగర్ సేఫ్…ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదు : సీఎం కేసీఆర్ 

కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 11:08 AM IST
కరీంనగర్ సేఫ్…ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదు : సీఎం కేసీఆర్ 

కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.

కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే కరీంనగర్ పర్యటన వాయిదా వేసుకున్నామని తెలిపారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం (మార్చి 21, 2020) సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  ఆదివారం (మార్చి 22, 2020) ఉదయం 6 గంటల నుంచి తెలంగాణలో జనతా కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు…అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం (మార్చి 21, 2020) సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

అవరసరమైతే ఇంటింటికీ రేషన్ కూడా సరఫరా చేసేందుకు సిద్ధమన్నారు. నిత్యవరసరుకులను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. 5 నుంచి 2 వేల వాహనాలను ఏర్పాటు చేసి ఇంటింటికి నిత్యవసరుకులను సరఫరా చేస్తామని చెప్పారు. తాము వెనుకడుగు వేయబోమని చెప్పారు. కరోనా ఆపద నుంచి గట్టేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. కరోనా నివారణకు రూ.5 వేల కోట్లే కాదు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

విదేశాల నుంచి వచ్చే వాళ్లు తమ బిడ్డలే..ప్రభుత్వానికి వాలంటరీగా సహకరించాలన్నారు. వైరస్ లక్షణాలుంటే ఐసోలేషన్ కు తరలిస్తామని చెప్పారు. వైరస్ లేకుంటే మందులిచ్చి పంపించి వేస్తామని, ఇబ్బంది పెట్టబోమని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కచ్చితంగా చికిత్స చేయించుకోవాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా రిపోర్టు చేయాలన్నారు. 
 

See Also | అవసరమైతే టోటల్ షట్‌డౌన్ : సీఎం కేసీఆర్