Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి రెండు గంటల సమయం

కార్తీకమాసం, ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు.

Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి రెండు గంటల సమయం

Yadadri Temple

Yadadri Temple : కార్తీకమాసం, ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

చదవండి : Yadadri : యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతం

సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదు. ఇక కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రసాదాల కౌంటర్ల సంఖ్యను పెంచారు.

చదవండి : Yadadri : బంగారు తాపడం కోసం..క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళం పంపిచొచ్చు