కార్తీక మాసం మొత్తం లగ్గాలే లగ్గాలు, మోగనున్న పెళ్లి భాజాలు

  • Published By: madhu ,Published On : November 17, 2020 / 02:12 AM IST
కార్తీక మాసం మొత్తం లగ్గాలే లగ్గాలు, మోగనున్న పెళ్లి భాజాలు

Kartika Masam : కార్తీక మాసం వచ్చేసింది. ఈ నెలలో లగ్గాలే లగ్గాలే ఉన్నాయంట. 2021 జనవరి 06 దాక మంచి ముహూర్తాలు ఉండడంతో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగతాయని అంచనా వేస్తున్నారు. కరోనా కారణంగా ఆపుకున్న పెళ్లిళ్లను ఈ నెల రోజుల్లో మూడు ముళ్లు వేయించాలని పట్టుమీద ఉన్నారంట. జనవరి 06 దాటిన తర్వాత…మే 12 వరకు మూఢాలున్నాయని చెబుతున్నారు.



ఆరు నెలలు ముహూర్తాలు లేకపోవడంతో.. ఈ కార్తీక మాసంలోనే..తమ వారికి పెళ్లిళ్లు చేయాలని భావిస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 దాక వచ్చే పుష్యమాసంలో గురుమూఢం ఉందని, ఫిబ్రవరి 12 నుంచి మాఘ మాసం మొదలైనా..మూఢం కొనసాగనుందని అంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ ఛైత్రమాసం ఉగాదితో ప్లవనామ సంవత్సరం మొదలైనా..పెళ్లి ముహుర్తాలు లేవంటున్నారు.



నెల రోజుల్లో వివాహాలు చేయకపోతే..దాదాపు ఆరు నెలల వరకు వెయిట్ చేయాల్సి వస్తుందని, ఆ శుభకార్యం ఏదో ఇప్పుడే జరిపించేద్దామని పబ్లిక్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మొత్తానికి లగ్గాల హడావుడి నెలకోవడంతో..ఈ రంగంపై ఆధార పడిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



ఇక కార్తీక మాసం ప్రారంభం కావడంతో..ఎటూ చూసిన దీపాల వెలుగులే. ఏ వాడలో అయినా..దేవుడి పాటలే వినిపిస్తున్నాయి. గుళ్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ఉదయాన్నే ఆలయాలకు చేరుకుంటున్నారు. రంగు రంగుల దీపాలతో ఆలయాలను అలంకరించారు. కరోనా కారణంగా…ఇన్ని రోజులు కళ తప్పిన ఆలయాలు..ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.



చిన్న ఆలయాల నుంచి మొదలు పెడితే..శ్రీకాళహస్తి, శ్రీశైలం పెద్ద పెద్ద ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడుండే..గుండాల్లో దీపాలను వదిలారు. కార్తీక మాసంలోనైనా శుభం కలుగాలని కోరుకుంటున్నారు.