Kathi Karthika: మధుయాష్కీతో భేటీ.. కాంగ్రెస్‌లోకి కత్తి కార్తీక?

తెలంగాణ యాసతో మాట్లాడుతూ క్రేజ్ దక్కించుకున్న ప్ర‌ముఖ యాంక‌ర్ క‌త్తి కార్తీక చాలా కాలంగా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం స‌న్నాహ‌కాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే క‌త్తి కార్తీక‌ ఫార్వ‌ర్డ్ బ్లాక్ త‌ర‌ఫున దుబ్బాక అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ పోటీ చేశారు.

Kathi Karthika: మధుయాష్కీతో భేటీ.. కాంగ్రెస్‌లోకి కత్తి కార్తీక?

Kathi Karthika

Kathi Karthika: తెలంగాణ యాసతో మాట్లాడుతూ క్రేజ్ దక్కించుకున్న ప్ర‌ముఖ యాంక‌ర్ క‌త్తి కార్తీక చాలా కాలంగా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం స‌న్నాహ‌కాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే క‌త్తి కార్తీక‌ ఫార్వ‌ర్డ్ బ్లాక్ త‌ర‌ఫున దుబ్బాక అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ పోటీ చేశారు. అయితే.. ఇక్కడ ఘోరపరాజయం ఎదుర్కొన్నారు. అప్పటి నుండి యాక్టివ్ రాజకీయాలలోకి దిగేందుకు సరైన ఫ్లాట్ ఫామ్ కోసం ముమ్మర వేటలో ఉన్నారు.

ఆ మధ్య కాలంలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ముమ్మర ప్రచారం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కార్తీక భేటీ కావడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. కానీ అది జరగలేదు. ఫైనల్ గా ఇప్పుడు కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఆదివారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీతో కత్తి కార్తీక సమావేశమయ్యారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమితులైన మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపినట్లు కార్తీక తెలిపారు.

అయితే ఈ సందర్భంగా మధుయాష్కీ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కత్తి కార్తీకను ఆహ్వానించగా.. అందుకు కార్తీక కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరికపై తెలంగాణ రాజకీయాలలో ఒకరకంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టీఆర్ఎస్ కీలక నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కత్తి కార్తీక దగ్గరి బంధువుగా చెప్తారు.