Kaushik Reddy : టీఆర్ఎస్ సీటు కన్ఫాం అన్న కౌశిక్ రెడ్డి, ఫోన్ కాల్ వైరల్…షోకాజ్ నోటీసు ఇచ్చిన టీపీసీసీ

Kaushik Reddy  : టీఆర్ఎస్ సీటు కన్ఫాం అన్న కౌశిక్ రెడ్డి, ఫోన్ కాల్ వైరల్…షోకాజ్ నోటీసు ఇచ్చిన టీపీసీసీ

Kaushik Reddy Audio Call Leaked

Kaushik Reddy : టీఆర్ఎస్ సీటు కన్ఫాం అయిపోయింది..తానే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అంటూ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి చేసిన వీడియో కాల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని యూత్ ను ఆయన టార్గెట్ చేశారని వీడియో కాల్ ని బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో..కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందని ఓ వ్యక్తితో మాట్లాడిన కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన వెంట వచ్చిన వారికి అన్నీ చూసుకుంటానని కౌశిక్ రెడ్డి హామీనిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటారనే తెగ ప్రచారం జరుగుతోంది.

Read More : – Old Age Love Marriage : 21 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల మహిళ లవ్ ఎఫైర్

కాంగ్రెస్ లో ఉంటానన్న కౌశిక్ :-
మంత్రిగా ఉన్న ఈటల బర్తరఫ్ అనంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం ఈటల బీజేపీలో చేరిపోయారు. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిఫై రావడం లేదు. ఇటీవలే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారాయన. ఇదిలా కొనసాగుతుండగా…టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.

Read More : – Revathi: కాళ్లకు బూట్లు లేకపోయినా పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్ కు రేవతి

కాల్ వైరల్ :-
దీంతో తనకు టికెట్ వస్తుందా ? లేదా ? అనే దానిపై కౌశిక్ రెడ్డి పునారాలోచనలో పడిపోయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే…కౌశిక్ రెడ్డి..పలువురికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తనతో రావాలంటూ..యువతను కోరుతున్నారు. మాదన్నపేటలో తనకు లిస్ట్ కావాలని..వారందరినీ మంచిగా చూసుకుంటాం.(డబ్బులు ఇస్తాం)…అంటూ విజయేందర్ తో మాట్లాడిన మాటలు చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం బొల్లం రాజిరెడ్డి కూడా మాట్లాడారు. వార్డు మెంబర్లను గుంజాలి..ఎక్కువగా యూత్ ను గుంజాలి..వీరికి రూ. 5 వేలు ఇస్తాం…తాగుడు, ఇతర ఖర్చులకు ఇస్తాం అంటూ చెప్పారు. వీరన్ని మనతోనే ఉండాలి..వెళ్లద్దు అంటూ చివరిలో చెప్పారు.

Read More : – Cricket: ‘వికెట్లు తీయడం కంటే ఫ్లైయింగ్ కిస్‌లే ఎక్కువ’

టీపీసీసీ సీరియస్ :-
దీనిపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం సీరియస్ గా తీసుకుంది. టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నట్లు క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు అందింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఫోన్ కాల్ వైరల్ కావడంతో వెంటనే చర్యలకు దిగింది కాంగ్రెస్. మరి..కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.