Telangana : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ మార్క్ ట్విస్ట్

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైల్ తన దగ్గరే ఉందని...ఒకే చెప్పేందుకు తనకు సమయం లేదన్నారు...

Telangana : కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ మార్క్ ట్విస్ట్

Trs

Kaushik Reddy : కౌశిక్ రెడ్డి. ఈయన హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తరపున నిలుస్తారనే జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన అనంతరం రాజకీయాలు వెడెక్కాయి. ఈటల బీజేపీ కండువా కప్పుకోవడం, కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించిన తర్వాత రాజకీయ పరిణామాలు స్పీడ్ గా మారిపోయాయి. హుజూరాబాద్ ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Read More : Priyanka Singh : ‘జబర్దస్త్’ సాయి తేజ నుంచి ‘బిగ్ బాస్ 5’ ప్రియాంక సింగ్ వరకు..

కాంగ్రెస్ కు కౌశిక్ గుడ్ బై : –
అప్పటి దాక కాంగ్రెస్ వీడనంటూ చెప్పుకొంటూ వచ్చిన…కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది కూడా. సీఎం కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి..గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడంతో ఆయన అభిమానులు, అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈటలకు ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి ఉంటారనే చర్చ కొనసాగింది.

Read More : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ..! ఉన్నట్టా.. లేనట్టా..?

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సిఫార్సు : –
ఈ క్రమంలో..గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఎంపికైన ప్రొ. శ్రీనివాసరెడ్డి పదవీకాలం జూన్ 16తో ముగిసిపోయింది. అప్పటిదాక హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డిని నియమిస్తారని అనుకుంటున్న తరుణంలో…అనూహ్యంగా..ఆయన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసేశారు. ఈ ఫైల్ గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వం. రోజులు గడుస్తున్నాయి కానీ..గవర్నర్ మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవిపై సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్సీగా ఉన్న గోరెటి వెంకన్న గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయ్యారు. ప్రభుత్వం ఫైల్ పంపిన కొద్దిరోజులకే…గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కానీ..కౌశిక్ రెడ్డి విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది ఆయన అభిమానులకు అంతుచిక్కలేదు.

Read More : Huzurabad Bypoll : ఈటల వీటికి సమాధానాలు చెప్పాలి – కౌశిక్ రెడ్డి

గవర్నర్ స్పందన : –
ఈ తరుణంలో…కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైల్ తన దగ్గరే ఉందని…ఒకే చెప్పేందుకు తనకు సమయం లేదన్నారు. 2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం ఈ విషయంపై గవర్నర్ స్పందించారు. ప్రస్తుతం తనకు ఒకే చెప్పే సమయం లేదని, ఇది గవర్నర్ నామినేషన్ అని వెల్లడించారు. సోషల్ వర్క్ చేస్తున్నారా ? అనేది చూస్తున్నట్లు, మ్యాటర్ స్టడీ చేయడం జరగుతోందని గవర్నర్ వెల్లడించడం గమనార్హం. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవిపై సందిగ్ధత నెలకొంది. మరి గవర్నర్ ఎమ్మెల్సీ పదవికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి.