Kavitha : కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి- సుకేశ్‌ వాట్సాప్ చాట్‌లపై కవిత ఫైర్

Kavitha: ఒక ఆర్థిక నేరగాడు లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే తప్పుడు వార్తలు ప్రచురించాయి.

Kavitha : కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి- సుకేశ్‌ వాట్సాప్ చాట్‌లపై కవిత ఫైర్

Kavitha

Kavitha : నేతలతో డబ్బుల విషయంపై జరిపిన సంభాషణలంటూ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ లీక్ చేసిన చాట్స్, లెటర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. సుకేశ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని కవిత స్పష్టం చేశారు. ఫేక్ చాట్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై ఇలాంటి దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

”ఆర్ధిక మోసగాడు సుకేశ్ తో నాకు ఎలాంటి పరిచయం లేదు. ఫేక్ చాట్స్ తో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఒక ఆర్థిక నేరగాడు లేఖ రాస్తే రాద్దాంతం చేస్తున్నారు. ఆ లేఖను పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సీఈసీకి లేఖ రాశారు. బీజేపీ టూల్ కిట్ లో భాగమే ఈ దుష్ప్రచారం. వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండానే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచురించాయి” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.(Kavitha)

Also Read..Sukesh Chandrasekhar : బీఆర్ఎస్ ఆఫీసులో అరుణ్ పిళ్లైకి రూ.15కోట్లు ఇచ్చా- మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్

కాగా, మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. ఈసారి అతడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని తెరపైకి తేవడం సంచలనం రేపింది. కవితతో తాను చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాటింగ్ అతడు రిలీజ్ చేశాడు. అందులో కవితను కవితక్కా అని సంబోధించాడు.

రూ.15 కోట్లు ముట్టజెప్పే విషయమై కవితతో తాను చాట్ చేశానంటూ పలు స్క్రీన్ షాట్లను సుకేశ్ రిలీజ్ చేశాడు. ఈ మేరకు 6 పేజీల లేఖను తన లాయర్ ద్వారా విడుదల చేశాడు సుకేశ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో తాను రూ.15కోట్లు ఇచ్చినట్లు మరోసారి చెప్పాడు సుకేశ్.(Kavitha)

Also Read..Sukesh Chandrasekhar : ఎమ్మెల్సీ కవితతో చాటింగ్..! సుకేశ్ చంద్రశేఖర్ మరో సంచలనం

కవితతో చాటింగ్ అంటూ సుకేశ్ రిలీజ్ చేసిన చాట్ స్క్రీన్ షాట్స్ కలకలం రేపాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. అందులో నిజం లేదన్నారు. అంతేకాదు, వాట్సాప్ చాట్ తెలుగులో ఉండటంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలీ జైల్లో ఉన్నాడు. కొంతకాలంగా ఆప్ నేతలను టార్గెట్ చేశాడు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ పై సంచలన ఆరోపణలు చేశాడు. వారి ఆదేశాల మేరకే 2020లో తాను బీఆర్ఎస్ ఆఫీసులో రూ.15కోట్లు ఇచ్చినట్లు బాంబు పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ లైసెన్స్ ల కోసం కవితతో లావాదేవీలు జరిగినట్లు సుకేశ్ ఆరోపించాడు. ఆప్ కు అనుకూలంగా హైదరాబాద్ నుంచి హవాలా ద్వారా వివిధ ఆసియా దేశాలకు మనీలాండరింగ్ జరిగినట్లు సుకేశ్ ఆరోపణలు చేశాడు.