Munugodu TRS Politics : మునుగోడు అసమ్మతి నేతల మీటింగుతో టీఆర్ఎస్ అలర్ట్..కూసుకుంట్లకు ఝలక్..

మునుగోడు అభ్యర్థి ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇద్దామనే యోచనలో ఉన్న అధిష్టానికి మునుగోడో టీఆర్ఎస్ అసమ్మతి నేతల సీకెట్ మీటింగ్ తో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. మునుగోడు అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నారు.

Munugodu TRS Politics : మునుగోడు అసమ్మతి నేతల మీటింగుతో టీఆర్ఎస్ అలర్ట్..కూసుకుంట్లకు ఝలక్..

KCR alert with meeting of TRS dissident leaders in Munugodu constituency..

Munugodu TRS Politics : మునుగోడు అభ్యర్థి ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇద్దామనే యోచనలో ఉన్న అధిష్టానికి మునుగోడో టీఆర్ఎస్ అసమ్మతి నేతల సీక్రెట్ మీటింగ్ తో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని..ఆయనకు బదులుగా ఎవరిని నిలబెట్టినా గెలుపు కోసం కష్టపడతామని తేల్చి చెప్పారు అసమ్మతి నేతలు. ఈ విషయంపై మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అసమ్మతి నేతలు తమ పట్టు వీడటం లేదు.దీంతో మునుగోడులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ బాస్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కూసుకుంట్లకు బదులుగా వేరే అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నారు. అసమ్మతి చల్లారకుంటే ఎదురయ్యే పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

Also read : Munugodu TRS Politics : కేటీఆర్ చెప్పినా తగ్గేదేలేదంటున్న మునుగోడు టీఆర్ఎస్ అసమ్మతి నేతలు..

దీంట్లో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ కంచర్ల సోదరులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ నుంచి కంచర్ల సోదరులకు పిలుపు రావటంతో ఆఘమేఘాలమీద వారు ప్రగతి భవన్ కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మునుగోడు టికెట్ ఆశించే వారిలో నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్టా రెడ్డి కూడా ఉన్నారు. ఈక్రమంలో కేసీఆర్ కంచర్ల సోదరులతో చర్చలు జరిపి కృష్ణారెడ్డికి టికెట్ కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..కంచర్ల కృష్టారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తు వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి తనకు మునుగోడులో పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also read : Munugodu TRS Politics : మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం..అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

ఇప్పటి వరకు మంత్రి జగదీశ్ రెడ్డికి తనపై ఉన్న అభిమానంతో తనకే టికెట్ వస్తుందని ఆశించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడులో అసమ్మతి నేతలు ఇచ్చిన ఝలక్ తో ఇక టికెట్ వచ్చే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తున్నాయి. కూసుకుంట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వందలాదిమంది నేతలు ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని..ఆయనకు బదులుగా ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తామని తేల్చి చెప్పటంతో గులాబీ బాస్ ఇక మునుగోడు బరిలో గులాబీ పార్టీ నుంచి నిలబెట్టే అభ్యర్థి కోసం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. దీంట్లో భాగంగానే కంచర్ల సోదరులకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. మరి చివరికి మునుగోడు గులాబీ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి ఎవరో తెలియాల్సి ఉంది.