Telangana : ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కామెంట్స్.. 95-105 స్థానాల్లో గెలుపు, ప్రశాంత్ కిశోర్ బెస్ట్ ఫ్రెండ్

ప్రశాంత్ కిశోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. 95 నుంచి 105 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 30 సీట్లలో సర్వే చేశారని.. అందులో...

Telangana : ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కామెంట్స్.. 95-105 స్థానాల్లో గెలుపు, ప్రశాంత్ కిశోర్ బెస్ట్ ఫ్రెండ్

Kcr

Telangana Early Elections : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతారా ? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇదే బెటర్ అని కేసీఆర్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జరిగింది. మంత్రులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేగాకుండా రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రముఖ వ్యక్తి ప్రశాంత్ కిశోర్ తో టీఆర్ఎస్ పని చేస్తోందని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే కూడా నిర్వహించిందనే ప్రచారం జరిగింది. ముందస్తు ఎన్నికలు.. ఇతరత్రా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదని కుండబద్ధలు కొట్టారు. ప్రశాంత్ కిశోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. 2022, మార్చి 21వ తేదీ సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) సమావేశం జరిగింది. వరి ధాన్యం కొనుగోలుతో పాటు.. ఇతర రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Read More : CM KCR : దేశంలో మార్పు అవసరం.. కొత్త జాతీయ పార్టీ రావొచ్చు – సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

గతంలో తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. తాము చేపట్టిన పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోతుందన్నారు. గతంలో ఎన్నికలకు వెళ్లిన సమయంలో 88 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం జరిగిందని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. 30 సీట్లలో సర్వే చేశారని.. అందులో 29 స్థానాల్లో గెలుస్తామని తేలిందన్నారు. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల విషయంలో కామెంట్స్ చేసిన వారిని అస్సలు పట్టించుకోమన్నారు.

Read More : Telangana Paddy : వన్ నేషన్..వన్ ప్రొక్యూర్‌‌మెంట్ ఉండాలి..అన్నీ రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలి – సీఎం కేసీఆర్ డిమాండ్

ప్రశాంత్ కిశోర్ పై వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిశోర్ తానే ఆహ్వానించినట్లు…ఆయన తనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ కు అనుభవం ఉన్నట్లు, 12 రాష్ట్రాల్లో పని చేసిన అతను డబ్బులు తీసుకుని పని చేసే వ్యక్తి కాదని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయనతో తాను చర్చలు జరుపుతున్నట్లు, ఐ ప్యాక్ సంస్థను నెలకొల్పాడని ఇందులో రహస్యం ఏముందున్నారు. దేశం కోసం పని చేస్తునప్పుడు తెలంగాణ కోసం పని చేయవద్దా ? అని ప్రశ్నించారు. దేశం గురించి ఆలోచించిన సమయంలో తెలంగాణ అంతర్భాగం కాదా ? అని ప్రశ్నించారు. దేశం కోసం ఎంత కమిట్ మెంట్ అతనికి ఎంత ఉంటుందో అందరికీ తెలియదన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి తాను ప్రశాంత్ కిశోర్ ను పిలవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పరిణామాలు మీరే చూస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు.