CM KCR : సీఎం మార్పుపై చర్చకు తెరదించిన కేసీఆర్.. పార్టీ నేతలకు గులాబీ బాస్ ఫుల్ క్లారిటీ

సీఎం మార్పుపై గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు చర్చకు ఆయన తెరదించారు. తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

CM KCR : సీఎం మార్పుపై చర్చకు తెరదించిన కేసీఆర్.. పార్టీ నేతలకు గులాబీ బాస్ ఫుల్ క్లారిటీ

CM KCR : టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లే జాతీయ పార్టీని ప్రకటించారు. దీంతో గులాబీ బాస్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారడంతో తెలంగాణ సీఎం మార్పుపై జోరుగా చర్చ మొదలైంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారు కనుక.. సీఎం బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారనే టాక్ వినిపించింది.

కాగా, సీఎం మార్పుపై గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పు చర్చకు ఆయన తెరదించారు. తెలంగాణ సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అటు జాతీయ పార్టీగా మారినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగేది తానేనంటూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టంగా చెప్పారు కేసీఆర్. దీంతో సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లు అయ్యింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అటు బీఆర్ఎస్ వేసే అడుగులపైనా నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. మహారాష్ట్ర, కర్నాటకలే టార్గెట్ గా అడుగులు వేయబోతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన మాత్రం కేసీఆర్ తీసుకురాలేదు.

దసరా(అక్టోబర్ 5) పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో పార్టీని అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్ గా కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో అనేక పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడలా మారిపోయిందని.. తనకు మాత్రం రాజకీయం అనేది ఒక టాస్క్ వంటిదని కేసీఆర్ చెప్పారు.

దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని కేసీఆర్ వాపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. మన దేశం బంగ్లాదేశ్ కంటే వెనుకబడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ వివరించారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు.

”నేను దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు… టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేస్తే ఎలా అని చాలామంది నన్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ తొలి కార్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్ర. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని.. అందుకే అఖిలేశ్ సింగ్ యాదవ్ ను ఈ సమావేశానికి రావద్దని చెప్పాం. త్వరలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలందరూ వస్తారు. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి” అని కేసీఆర్ ఆకాంక్షించారు.

మునుగోడు ఉపఎన్నికలపైనా కేసీఆర్ స్పందించారు. మునుగోడులో 51శాతం ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆయన చెప్పారు. దేశంలో బలమైన వనరులు, క్యాడర్ ఉన్న పార్టీగా ఇప్పటికే టీఆర్ఎస్ ఎదిగిందన్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ తో జాతీయ పార్టీగానూ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు కేసీఆర్. మహారాష్ట్ర, కర్నాటకలే టార్గెట్ గా బీఆర్ఎస్ అడుగులు సాగనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇకపై టీఆర్ఎస్ నాయకులంతా జాతీయ ధృక్పథంతో పని చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.