KCR: వాత పెట్టినా బీజేపీకి బుద్ధి రావడం లేదు: కేసీఆర్

నాటి ఎమర్జెన్సీ మాదిరే ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు.

KCR: వాత పెట్టినా బీజేపీకి బుద్ధి రావడం లేదు: కేసీఆర్

Centre's Delhi ordinance

KCR – Delhi ordinance : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) హైదరాబాద్ (Hyderabad)లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ(Delhi)లో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో కేంద్ర ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడానికి కేసీఆర్ అంగీకరించారు.

అనంతరం ముగ్గురు సీఎంలు ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో కేంద్రం ప్రభుత్వ అరాచకాలు శ్రుతి మించాయని కేసీఆర్ అన్నారు. “రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. ఢిల్లీలో పాపులర్ ప్రభుత్వం ఉంది.. ఎలా ఆర్డినెన్సు తెస్తారు?

మోదీ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. కర్ణాటకలో కర్రుకాల్చి వాత పెట్టారు.. బుద్ధి రావడం లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా వేధింపులు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వంపై ఆర్డినెన్సు తీసుకురావడం దుర్మార్గం.

నాటి ఎమర్జెన్సీ మాదిరే ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేజ్రీవాల్ కు మా మద్దతు ఇస్తున్నాం… ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో పోరాడుదాం. ఢిల్లీ ప్రజలను మోదీ సర్కారు అవమానిస్తోంది.

ప్రజలు బుద్ధి చెబుతారు. మోదీ ప్రభుత్వం సొంత ప్రతిష్ఠ అంటూ చూసుకోకుండా ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలి లేకుంటే కర్ణాటక మాదిరే అన్ని ప్రాంతాల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాగా,

YS Viveka Case: అప్పటివరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొద్దు: తెలంగాణ హైకోర్టు