KCR-BRS: నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. కాసేపట్లో నవచండీ యాగం ప్రారంభం కానుంది. గణపతి హోమం కూడా జరుపుతారు.

KCR-BRS: నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

KCR-BRS

KCR-BRS: తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీలో సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. కాసేపట్లో నవచండీ యాగం ప్రారంభం కానుంది. గణపతి హోమం కూడా జరుపుతారు.

తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే, దేశంలోని పలు రాష్ట్రాల నేతలు, రైతు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నిన్న కేసీఆర్‌ అక్కడ పనులు జరుగుతున్న తీరును పరిశీలించి, యాగశాలను చూశారు. పార్టీ శాశ్వత భవన నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించి వెళ్లారు.

నవచండీ హోమం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఇందులో కేసీఆర్‌ దంపతులు పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

Man Kills Family : దారుణం.. భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య