కీసర ఏసీబీ కేసులో మరో ఆత్మహత్య, ఉరేసుకున్న ధర్మారెడ్డి

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 12:01 PM IST
కీసర ఏసీబీ కేసులో మరో ఆత్మహత్య, ఉరేసుకున్న ధర్మారెడ్డి

Keesara Bribe ACB case, Dharma Reddy Suicide : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో ఆత్మహత్యల పర్వం కొనసాగుతోంది. కోటికి పైనే లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎమ్మార్వో నాగరాజు.. ఈ మధ్యకాలంలోనే జైల్లో సూసైడ్ చేసుకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే.. ఇదే కేసులో మరో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాజీ ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు.. వరుసగా సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్దిసేపటి క్రితం ధర్మారెడ్డి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.



ఒక్క అవినీతి కేసు.. రెండు ఆత్మహత్యలు.. ఇక ముందు కూడా ఇదే జరుగుతుందా? కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా.. ఒకరి తర్వాత మరొకరు సూసైడ్ చేసుకోవడం వెనకున్న కారణాలేంటి? కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో.. ముందు నాగరాజు చనిపోయాడు. కేసు తేలకముందే.. కోర్టులో నేరం రుజువు కాకముందే.. దోషిగా తేల్చకముందే.. జైల్లోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి కూడా సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.



జైలు నుంచి బెయిల్‌పై రిలీజైన 10 రోజుల తర్వాత.. ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఆయనకు ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్యకు ముందు.. ఒక రోజంతా ధర్మారెడ్డి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. ఆ సమయంలో.. ఆయన ఎక్కడకు వెళ్లారన్న దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.



ధర్మారెడ్డి ఆత్మహత్యపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇప్పుడు ధర్మారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ అనుమానాస్పద మరణాల వెనుక మర్మమేంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు.. రోజంతా ధర్మారెడ్డి ఎక్కడకు వెళ్లాడు? ధర్మారెడ్డిని ఎవరైనా కలిశారా? ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందన్నదే ఇప్పుడు బిగ్ సస్పెన్స్‌గా మారింది.